గర్భిణీలకు కివి ఫ్రూట్స్ అందించే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ...!!

ప్రెగ్నెన్సీ అత్యంత ముఖ్యమైన విషయం. మహిళ గర్భం పొందిన వెంటనే ఆహారాల మీద ఎక్కువ ఇష్టం కలిగి ఉంటారు. ఎప్పుడు తినని ఆహారాల మీద కూడా ఈ సమయంలో కోరిక పుడుతుంది. వివిధ రకాల ఆహారాల మీద ఎంత కోరిక కలిగినా, అవి ఆరోగ్యకరమైనవి అయితే తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ఎక్కువగా స్వీట్స్ ను ఇష్టపడుతుంటారు. కానీ ఆర్టిఫిషయల్ స్వీట్నర్స్ ను ఎక్కువ తీసుకోకూడదు.

గర్భిణీ , మరియు కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే నేచురల్ స్వీట్ ను అందించే పండ్లు, ఇతర నేచురల్ ఫుడ్స్ తీసుకోవచ్చు. అటువంటి పండ్లలో కివి ఫ్రూట్ లేదా చైనీ గూస్బెర్రీ ఒకటి. ఈ జ్యూసీ ఫ్రూట్ మంచి టేస్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫ్రూట్స్ లో జీరో కొలెస్ట్రాల్ మరియు చాలా తక్కువ షుగర్ మరియు ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. రుచి మాత్రమే కాదు, గర్భిణీలు కివీ ఫ్రూట్స్ తినడం వల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయండి..

పొల్లెట్ :

పొల్లెట్ :

కివి ఫ్రూట్ లో ఫొల్లెట్ అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలు, మరియు పెట్టే బిడ్డలో కణాల ఏర్పడుటకు అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి మరియు పెరుగుదలకు ఫొల్లెట్ అత్యంత అవసరమైనది. ఫొల్లెట్ సరిపడా ఉన్నట్లైతే, స్పైనల్ కార్డ్ కు సంబందించిన బిఫిడా వంటి పుట్టక లోపాలను నివారిస్తుంది. గర్భస్రావం నివారిస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు మాత్రమే కాదు, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వారు కూడా తినడం మంచిది.

 విటమిన్ సి:

విటమిన్ సి:

కివి ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇందులో 140శాతం విటమిన్ సి కలిగి ఉంది, దీన్ని డైలీ డోస్ గా తీసుకోవచ్చు . గర్భిణీలు విటమిన్ సి ఆహారాలను తీసుకోవల్సినప్పుడు కివిఫ్రూట్స్ ను ఎంపిక చేసుకోవడం మంచిది . ఇది బేబీ డెవలప్మెంట్ కు కూడా సహాయపడుతుంది. బేబీలో బ్రెయిన్ ఫంక్షన్స్ చురుకుగా పనిచేయాలంటే, న్యూరోట్రాన్స్ మీటర్ కు కివీ ఫ్రూట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

నేచురల్ షుగర్స్:

నేచురల్ షుగర్స్:

కివి ఫ్రూట్ లో నేచురల్ షుగర్స్ అధికంగా ఉంటాయి. ఇవి స్వీట్స్ తినాలనే కోరికను తగ్గిస్తాయి,. కివీ ఫ్రూట్ లో గ్లిజిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో జస్టేషనల్ డయాబెటిటస్ సమస్య ఉండదు . జస్టేషనల్ డయాబెటిస్ ప్రెగ్నెన్సీలో చాలా సాధారణం.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:

గర్భధారణ సమయంలో మలబద్దకం మరియు హెమరాయిడ్స్ చాలా సాధారణం. గర్భధారణలో ఈ సమస్యను నివారించుకోవాలంటే, కివిఫ్రూట్స్ ఒక బెస్ట్ ఫ్రొబయాటిక్ ఫ్రూట్. ప్రొబొయోటిక్స్ లో ఎంజైమ్స్, డైటరీ ఫైబర్, మరియు ఫినోలిక్ కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి . ఈ న్యూట్రీషియన్, జీర్ణవాహికలోని ప్రొబయోటిక్ బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కివి ఫ్రూట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల మలబద్దకం, డయోరియా, గ్యాస్ట్రిక్ మరియు కడుపుబ్బరం, పొట్ట ఉదరంలో నొప్పిని నివారిస్తుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

కివిఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫీటస్ లో ఆర్ ఎన్ ఎ మరియు డిఎన్ ఎ లు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగించి వ్యాధులు మరియు అనారోగ్యాల పాలవ్వకుండా నివారిస్తుంది. మరియు ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది.

హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది:

హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది:

గర్భధారణ సమయంలో హార్మోనుల సమస్యలు చాలా సాధారణం. కొన్ని సందర్భాల్లో ఒక్కో సమయంలో చాలా ఎమోషనల్ గా మరియు కొన్ని సందర్భాల్లో చాలా సంతోషంగా కనబడుతుంటారు. డిప్రెషన్, టయర్డ్ నెస్ మరియు ఒత్తిడి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడే హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది. సమస్యలను దూరం చేసుకోవడానికి వీటిని రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

స్కిన్ అలర్జీ :

స్కిన్ అలర్జీ :

కివి ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెర్బిటల్ అలర్జీలు మరియు గ్యాస్ట్రిక్, లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. కివి ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో సలాడ్స్, డిజర్ట్ మరియు ఇతర వంటకాల్లో ఉపయోగించి తీసుకోవచ్చు.

డైటరీ ఫైబర్:

డైటరీ ఫైబర్:

కివి ఫ్రూట్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మహిళలు ప్రెగ్నెన్సీలో డైటరీ ఫైబర్ తీసుకోవడం వల్ల, గర్భధారణ సమయంలో వచ్చే హెమరాయిడ్స్, మలబద్దకం నివారించుకోవచ్చు. అలాగే గ్యాస్ , పొట్ట సమస్యలు వంటివి తగ్గించుకోవచ్చు.

ఎనర్జీ బూస్టర్:

ఎనర్జీ బూస్టర్:

ఎనర్జీ బూస్టర్: కివి ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, ఇందులో విటమిన్ సి, వాటర్ సోలబుల్ విటమిన్స్, మరియు విటమిన్ డి , ఫ్యాట్ సోలబుల్ విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో వివిధ రకాల ఫ్రీరాడికల్స్ తో పోరాడే లక్షణాలు కలిగి ఉంటుంది. ఎనర్జీ లెవల్స్ పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

Story first published: Monday, July 11, 2016, 11:31 [IST]
Desktop Bottom Promotion