Latest Updates
-
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం!
గర్భిణీ ప్లమ్ ఫ్రూట్స్ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు
గర్భం పొందడం ఒక అద్భుత విషయం. దేవుడు ఇచ్చిన వరం. గర్భం పొందిన తర్వాత మహిళలో వివిధ రకాల ఆందోళనలు,ఆలోచనలు. ముఖ్యంగా తినే ఆహారాల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి. ఎంత పరిమాణంలో తీసుకోవాలి , తీసుకునే ఆహారాల ద్వారా సరైన పరిమాణంలో న్యూట్రీషియన్ అందుతున్నాయా లేదా అన్నఆందోళన ప్రతి తల్లిలో ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారాల వల్ల బిడ్డకు న్యూట్రీషియన్స్ అందుతాయి. బిడ్డ హెల్తీపెరగడానికి తల్లి తీసుకునే ఆహారాలు సహాయపడుతాయి.
అయితే, గర్భిణీలు తీసుకునే ఆహారాల బట్టే శరీరంలో హార్మోనులు ప్రభావం ఉంటుంది. హార్మోనులు సరిగా ఉత్పత్తి అవ్వడానికి సహాయపడుతాయి. కాబట్టి, గర్భిణీలు తీసుకునే ఆహారాల గురించి పూర్తిగ తెలుసుకుని ఉండాలి. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలను తెలుసుకోవాలి. నేచురల్ ఫుడ్స్ ను తినాలి. జంక్ ఫుడ్ జోలికివెల్లకూడదు. నిపుణులు సలహాలు తీసుకోవాలి.
ప్లమ్ జ్యూస్: గర్భిణీలకు 9గొప్ప ప్రయోజనాలు
ప్రెగ్నెన్సీ డైట్ లో ప్లమ్స్ చేర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు . గంగరేగు పండుకన్నా కాస్త పెద్దగా.. యాపిల్‌లా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బుకారా పండ్లను చూడగానే నోరూరుతుంది. వీటినే ఇంగ్లీషులో ప్లమ్ ఫ్రూట్స్ అంటారు. ఇవి చూడటాని చిన్నగా జ్యూసిగా సింగిల్ సీడ్ తో నోరూరిస్తుంటాయి.ప్లమ్ ఫ్రూట్ లో విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి.
అందుకే ఈ పండ్లు గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగపడుతాయి. ఇందులో అత్యధికంగా డైటరీ ఫైబర్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండి కడుపులో పిండ ఎదుగుదలకు గ్రేట్ గా సహాయపడుతాయి . అందుకే గర్భణీ స్త్రీల యొక్క డైట్ లో ఇవి తప్పనిసరిగా చేర్చడం జరిగింది. గర్భధారణ సమయంలో గర్భిణీలు ప్లమ్స్ తినడానికి గల ఆరోగ్యకరమైన కారణాలు ఈ క్రింది విధంగా..

ప్రీమెచ్యుర్ లేబర్ నివారిస్తుంది:
గర్భధారణ సమయంలో ప్రీమెచ్యుర్ లేబర్ గురించి గర్భిని ఆందోళ చెందుతుంది. ప్రసవించాల్సిన డేట్ కంటే ముందుగా ప్రసవించడం. ప్లమ్స్ లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి మజిల్స్ ను రిలాక్స్ చేస్తాయి. ఇవి ప్రీమెచ్యుర్ బర్త్ కాకుండా నివారిస్తాయి.

ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది:
గర్భధారణ సమయంలో తల్లితో పాటు, బిడ్డకు సరిపడా రక్త ప్రసరణ అవసరమవుతుంది. సరిగా రక్తం లేకపోతే అనీమియాకు దారితీస్తుంది. దాంతో ఐరన్ సప్లిమెంట్ తీసుకోవల్సి వస్తుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో ప్లమ్స్ చేర్చుకోవాలి. ప్లమ్స్ లో ఉండే విటిమన్ సి తల్లి తీసుకునే ఆహారా ద్వారా ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది .

మలబద్దకం మరియు హెమరాయిడ్స్ నివారిస్తుంది:
గర్భధారణ సమయంలో హార్మోనుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. యూట్రస్ వద్ద హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల యూట్రస్ పెద్దగా మారుతుంది. జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల కడుపుబ్బరం, మలబద్దకం, హెమరాయిడ్స్ సాధారణంగా ఉంటాయి. ప్లమ్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బౌల్ మూమెంట్ సరిగా ఉంటుంది. మలబద్దకం నివారిస్తుంది.

అలసట మరియు ఒత్తిడి తగ్గిస్తుంది:
గర్భధారణ సమయంలో అలసటగా ఉంటుందని చాలా మంది మహిళలు చెబుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఎనర్జీ లెవల్స్ చాలా తగ్గిపోతాయి . చాలా మంది మహిళలు నార్మల్ లైఫ్ పొందడానికి కష్టంగా బావిస్తారు. గర్భిణీలు ప్లమ్స్ తినడం వల్ల వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు పొటాషియం వల్ల ఎనర్జీలెవల్స్ పెరుగుతాయి .

బోన్ హెల్త్ :
గర్భిణీలో పుట్టబోయే బిడ్డ పెరుగుదలకు, బోన్ స్ట్రక్చర్ ఏర్పాటుకు క్యాల్షియం అధికంగా అవసరమవుతుంది. ప్లమ్స్ నుండి క్యాల్షియం ఎక్కువగా అందుతుంది కాబట్టి, గర్బిణీలు ప్లమ్ ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. ప్లమ్ లో విటమిన్ కె మరియు విటమిన్ డిలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:
గర్భిణీలో ఫ్లూ , డయోరియా, జలుబు వంటి సాధారణ జబ్బులను నివారించడానికి , ప్లమ్స్ లో ఉండే విటమిన్ సి సహాయపడుతుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచి గర్భిణీలో వచ్చే సహజ అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.

రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది:
ప్లమ్ ఫ్రూట్ లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ క్లాట్స్ నివారిస్తుంది.

జెస్టేషనల్ డయాబెటిస్ నివారిస్తుంది:
జస్టేషనల్ డయాబెటిస్ చాలా సాధారణంగా ఉంటుంది. చాలా మంది ప్రెగ్నెంట్ మహిళల్లో జస్టేషనల్ డయాబెటిస్ సాధారణంగా ఉంటుంది. కాబట్టి, గర్భిణీలు లో గ్లిజిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి, గర్భిణీల్లో జస్టేషనల్ డయాబెటిస్ ను నివారించడానికి ప్లమ్ ఫ్రూట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది:
గర్భణిలో బ్లడ్ ప్రెజర్ ఎక్కువ తక్కువ ఉంటుంది. ప్లమ్ ఫ్రూట్స్ తినడం వల్ల వీటిలో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది.



Click it and Unblock the Notifications