Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ప్రెగ్నెన్సీ సమయంలో నువ్వులు తీసుకోవడం మంచిదేనా ?
స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం గర్భాధారణ. ఆమె తీసుకొనే ప్రతి ఆహార పదార్థం ఆమె ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఆమె తీసుకొనే ప్రతి ఆహారం మీద తప్పని సరిగా జాగ్రత్త కలిగి ఉండాలి. గర్భం ధరించిన తర్వాత నువ్వులు తినకూడదనే అపోహా చాలా మందిలో ఉంది, నువ్వులు తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందని భావిస్తుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే.
ఎందుకంటే గర్భిణీలు నువ్వులు తినడం వల్ల గర్భాధరణ సమయంలో తల్లికి అవసరం అయ్యే పోషకాలు, క్యాల్షియం, విటమిన్స్ , అమినోయాసిడ్స్ మరియు ప్రోటీన్స్, ఐరన్ లు పుష్కలంగా అందడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే నువ్వులు చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి.

ఏ ఆహారమైన పరిమితంగా తీసుకోవడం వల్ల తల్లి బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదు. వీటిని తీసుకోవడం వల్ల దంత సమస్యలను నివారిస్తాయంటున్నారు నిపుణులు. అదే విధంగా గర్భధారణ సమయంలో నువ్వులు తినడం వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆహార నిపుణులు. అయితే ఒక పరిమితిలో నువ్వులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల గర్భిణీ స్త్రీ పొందే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...
పోషకాలను అధికం: నువ్వుల్లో క్యాల్షియం, న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ విటమిన్ బి, ఇ, సి, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఐరన్ ఒక న్యూట్రల్ ఫుడ్ కాబట్టి ఇది ఎలాంటి డిజార్డర్స్ రాకుండా ఎదుర్కొంటుంది.

మలబద్దకం నివారిస్తుంది: గర్భధారణ సమయంలో ప్రతి ఒక్క మహిళ ఎదుర్కొనే సమస్య మలబద్దకం. ఈ సమస్య నుంచి బయటపడాలంటే నువ్వులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మితంగా తీసుకోవడం వల్ల మలబద్దక సమస్యను నివారిస్తుంది.
వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది: గర్భధారణ సమయంలో నువ్వులతో తయారుచేసిన ఆహారాలు తినడం వల్ల నువ్వుల్లో ఉండే న్యూట్రీషియన్స్ వ్యాధినిరోధకశక్తి పెరగుతుంది. దాంతో గర్భిణీలో ఫ్లూ, దగ్గు , జలుబు వంటివి రాకుండా ఉంటాయి.

తరచూ మూత్రవిసర్జన సమస్య: గర్భధారణ సమయంలో తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి నువ్వులు సహాయపడుతాయి. వీటిని తీసుకోవడం వల్ల యూరిన్ అవుట్ పుట్ నార్మల్ స్థితికి చేరుకుంటుంది.
నరాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది: గర్భిణీలు నువ్వుల తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరిలో నాడీ వ్యవస్థ, ఎముకలు స్ట్రాంగ్ గా మరియు ఫిట్ గా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే ఎనర్జిటిక్ గా ఉండటమే కాదు, మెంటల్ వీక్ నెస్ ను తగ్గిస్తుంది.
తల్లి తీసుకొనే ప్రతి ఒక్క ఆహారపదార్థం జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన ఆహారాలను తినకుండా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో హార్ట్ బర్న్ కు గురి కాకుండా ఉండవచ్చు.



Click it and Unblock the Notifications