Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
గర్భిణీలు ‘‘తులసీ టీ ’’ తాగడం వల్ల పొందే గొప్ప ప్రయోజనాలు
తులసిలో దాగున్న ఆరోగ్యప్రయోజనాలు లెక్కలేనివి. ఇందులో అనేక మెడిసినల్ విలువలు ఉన్నాయి. అయితే.. గర్భిణీ స్త్రీలకు ఇది మరింత శ్రేయస్కరం. అందుకే తులసి ఆకులను గర్భధారణ సమయంలో ఖచ్చితంగా తీసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తులసి ఆకు తీసుకోవడం చాలా శ్రేయస్కరం, సేఫ్ అని గుర్తుంచుకోండి.
తులసిలో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో దాగున్నాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా రెగ్యులర్ గా తులసి ఆకులు తీసుకోవాలి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్స్, వ్యాధులను నయం చేస్తుంది. ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే క్రిమీ కీటకాలను నాశనం చేసే పవర్ తులసిలో ఉంది.

తులసి ఆకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉన్నాయి. అనేక రకాల వ్యాధులు నయం చేయడంలో తులసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గర్భధారణ సమయంలో తులసి ఆకులు లేదా తులసి టీని తాగడం వల్ల పుట్టబోయే బిడ్డకు తల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తులసి హెర్బల్ టీని ఖచ్చితంగా తీసుకోవాలి అనడానికి అనేక కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డిటాక్సిఫై చేస్తుంది: తులసి లో ఉండే అమేజింగ్ డిటాక్సిఫైయింగ్ లక్షణాలు, హార్ట్ మరియు లంగ్స్ ను డిటాక్సిఫై చేస్తుంది. టిష్యులను క్లీన్ చేస్తుంది . ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా రక్షణ కల్పిస్తుంది.

జీరో కెఫిన్ : తులసి టీలో కెఫిన్ ఉండదు. గర్భిణీ మహిళలు వారి రెగ్యులర్ డైట్ లో కెఫిన్ లేని డ్రింక్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఫ్రీరాడికల్స్ ను క్రమబద్దం చేస్తుంది: తులసి టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో ఎలాంటి వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ సోకకుండా నివారిస్తాయి. ఫ్రీరాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తాయి. దాంతో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది.

జాయింట్ పెయిన్ తగ్గిస్తుంది: గర్భధారణ సమయంలో గర్భిణీలో అనేక సమస్యలుంటాయి. జాయింట్ పెయిన్, మజిల్ పెయిన్స్ , బాడీ పెయిన్స్ నివారించడంలో తులసి టీ గ్రేట్ గా సహాయపడుతుంది . తులసి టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వీక్ బోన్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

స్ట్రెస్ తగ్గిస్తుంది: గర్భధారణ సమయంలో ప్రతి ఒక్క మహిళ స్ట్రెస్ గా ఫీలవుతుంది. తులసి టీ గర్భిణీల్లో స్ట్రెస్ తగ్గించి, మజిల్స్ ను రిలాక్స్ చేస్తుంది. తులసి టీని హ్మాపీ హార్మోన్స్ ను విడుదతల చేస్తుంది. దాంతో స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. మనస్సును ప్రశాంత పరుస్తుంది.

తులసి టీ ఎలా తయారుచేయాలి:
తులసి టీని తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టదు, ఇండియాలో ప్రతి ఒక ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తుసిల ఆకులను ఫ్రెష్ లేదా డ్రైవి తీసుకుని, నీటిలో వేసి బాగా ఉడికించాలి. తర్వాత వడగట్టి, తేనె, నిమ్మరసం మిక్స్ చేసి రోజుకొక్కసారి తీసుకోవాలి.



Click it and Unblock the Notifications