Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ప్రెగ్నెంట్స్ లో శరీర ఉష్ణోగ్రత తగ్గించే హోం రెమిడీస్
గర్భందాల్చిన దగ్గరి నుంచి మహిళలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. మలబద్ధకం, వికారం, తిమ్మిర్లు, బీపీ వంటి సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తాయి. అయితే వీటన్నింటినీ అధిగమించడం పెద్ద టాస్క్ లాంటిదే. ఈ సమస్యలకు భయపడకుండా, డిప్రెషన్ కి లోనవకుండా ఉండటం చాలా అవసరం.
అయితే ఇవన్నీ కామన్. పెద్ద ప్రమాదకరమైనవి కావు. కానీ.. చాలామంది మహిళలు బాడీ టెంపరేచర్ లో మార్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది కాస్త ప్రమాదకరమనే చెప్పాలి. ఎందుకంటే.. దీనివల్ల గర్భస్రావం అయ్యే ఛాన్స్ లు కూడా ఉంటాయి. దీనివల్ల బిడ్డ పెరుగుదలకు కూడా ఆటంకం ఏర్పడవచ్చు.
గర్భధారణ సమయంలో ఉసిరికాయ తినడం వల్ల చెప్పలేనన్ని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు...
కాబట్టి 36.5 నుంచి 37.5 డిగ్రీ సెల్సియస్ మధ్య శరీర ఉష్ణోగ్రత ఉంటే ఉత్తమం. ఒకవేళ మీ శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరగడం, వంటి లక్షణాలు మీలో కనిపిస్తూ ఉంటే.. ఈ హోం రెమిడీస్ ఫాలో అవడం చాలా మంచిది. వీటి ద్వారా శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయవచ్చు.
గర్భధారణ సమయంలో శరీర వేడి పెరగడానికి చిహ్నాలు ఏమిటి? హార్ట్ బీట్ పెరగడం అనేది మొదటి లక్షణంగా చెప్పవచ్చు. మీ శరీరంలోని ఎగువ ప్రాంతంలో అకస్మాత్తుగా తీవ్రమైన వేడి ఫీలింగ్ కలగడం మరో లక్షణంగా చెప్పవచ్చు. ఇలాంటి లక్షణాలను గర్భిణీలు నిర్లక్ష్యం చేయకూడదు. మెడ, ముఖం, ఛాతీ ప్రాంతంలో ఎక్కువ చెమట, ఎర్రగా కందిపోవడం వంటి సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
30 కాదు 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన హీరోయిన్స్

శరీరం ఎందుకు వేడెక్కుతుంది ?
ఉష్ణోగ్రత పెరుగుదలకు హార్మోన్లలో మార్పులే కారణం. ఈస్ట్రోజెన్ స్థాయి క్షీణత, ఒత్తిడి స్థాయి పెరగడం వల్ల గర్భధారణ సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆహారం కూడా శరీరంలో వేడి పెరుగుదలకు కారణం కావచ్చు.

కొబ్బరి నీరు:
వారానికి మూడు గ్లాసుల కొబ్బరినీళ్లు మూడుసార్లైనా తాగాలి. కొబ్బరినీళ్లు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి.. చల్లబరుస్తాయి.

మెంతులు:
గర్భధారణ సమయంలో శరీరంలో వేడి తగ్గించడానికి ఉదయం అల్పాహారానికి ముందు మెంతుల నీళ్లు తాగడం చాలా మంచి పరిష్కారం. ఇవి శరీరంలో వేడి నియంత్రించడానికి బాగా ఉపయోగపడతాయి.

కూరగాయలు:
గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ టైంలో ఆరోగ్యకరమైన కూరగాయలు తినడటం చాలా ముఖ్యం. కూరగాయలు శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తాయి. కూరగాయలు గర్భస్త శిశువుకి పోషకాలు, ప్రోటీన్లు అందిస్తాయి.

పండ్లు:
పుచ్చకాయ గర్భధారణ సమయంలో శరీరం వేడిని తగ్గిస్తుంది. పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. పుచ్చకాయలో సహజ చక్కెర స్థాయిలు ఉంటాయి. ఇవి 9 నెలలు కావాల్సిన శక్తిని అందిస్తాయి.

ఉసిరికాయ:
ఉసిరికాయలను ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవడం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువైతే.. ప్రీటర్న్ బర్త్ అయ్యే ప్రమాదం ఉంది.

నీరు:
గర్భిణీలు అయినా.. కాకపోయినా నీళ్లు తాగడం చాలా అవసరం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. శరీరంలోని వేడిని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ నీళ్లు. గర్భిణీ స్త్రీలు శరీరానికి కావాల్సిన మోతాదులో నీళ్లు తాగితేనే బాడీ టెంపరేటర్ ని అదుపులో ఉంచవచ్చు.



Click it and Unblock the Notifications