Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ప్రెగ్నెన్సీ సమయంలో స్ట్రెయిట్ గా పడుకుంటే ఏమవుతుంది ?
కన్సీవ్ అయిన తర్వాత మహిళలు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రలేచింది మొదలు నిద్రపోయే వరకు ప్రతి ఒక్క విషయంలోనూ చాలా అలర్ట్ గా ఉండాలి. తీసుకునే ప్రతి ఆహారం హెల్తీగా ఉండాలి. పోషకాలతో కూడినదై ఉండాలి. అలాగే.. జ్యూస్ లు, డ్రింక్స్ ఏవైనా.. ఆచితూచి తీసుకోవాలి. అలాగే నిద్రించే భంగిమ విషయంలోనూ చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.
గర్భాశయంలో బేబీ.. చేసే ఆశ్చర్యకర విషయాలు
గర్భిణీ స్త్రీలు వెల్లకిలా పడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే మొదటి కొన్ని నెలల గర్భధారణ సమయంలో.. ఇది సమస్య కాదు. కానీ.. నెలలు గడిచే కొద్దీ అంటే సెకండ్ ట్రైమ్ స్టర్ లో, పొట్ట పెద్దగా అయిన తర్వాత స్ట్రెయిట్ గా పడుకోవడం తేలికైనది కాదు.. హెల్తీ కూడా కాదు. ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెయిట్ గా పడుకుంటే ఏమవుతుంది ? ఇది ప్రమాదకరమా ?

అవయవాలపై ఒత్తిడి
నెలలు గడిచిన తర్వాత గర్భిణీ స్త్రీలు స్ట్రెయిట్ గా పడుకుంటే.. గర్భాశం ద్వారా ముఖ్యమైన అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది.

నరాలపై ఒత్తిడి
కొన్ని సందర్భాల్లో స్ట్రెయిట్ పడుకోవడం వల్ల.. గర్భాశయం నరాలపై ఒత్తిడి పెంచుతుంది. అది రక్తాన్ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది.

బేబీకి అనారోగ్యం
ఎక్కువ సమయం గర్భిణీ స్త్రీలు స్ట్రెయిట్ గా పడుకోవడం వల్ల.. కడుపులో బేబీకి ఆక్సిజన్, పోషకాలు తక్కువగా అందడం వల్ల హార్ట్, లంగ్స్ పై ఒత్తిడి పెరుగుతుంది.

బ్యాక్ పెయిన్
గర్భిణీ స్త్రీలు నెలలు గడిచిన తర్వాత వెల్లకిలా పడుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే హిప్స్ లోనూ నొప్పి వస్తుంది.

తలతిరగడం
ఎక్కువ సమయం అంటే రాత్రంతా స్ట్రెయిట్ గా పడుకుని.. తర్వాత లేచినట్లైతే.. ఉదయాన్నే తలతిరిగినట్టు అనిపిస్తుంది.

బిడ్డ ఆరోగ్యం
కాబట్టి నిపుణులు సూచించినట్టు నిద్రపోయినట్లైతే.. కడుపులోని బిడ్డ హెల్తీగా ఉంటారు.

ఎడమవైపు
గర్భిణీ స్త్రీలు ఒకవైపు తిరిగి పడుకోవడం సురక్షితం. అయితే ఎడమవైపు తిరిగి పడుకోవడం చాలా ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తారు.

కంఫర్టబుల్
ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల.. బేబీకి ఎక్కువ ఆక్సిజన్, బ్లడ్ అందుతుంది. అలాగే గర్భిణీలకు కూడా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

కాళ్ల మధ్యలో దిండు
ఒకవేళ ఎడమవైపు తిరిగి పడుకోవడానికి అనుకూలంగా లేకపోతే.. దిండుని.. కాళ్ల మధ్యలో పెట్టుకుని పడుకుంటే.. మరింత కంఫర్ట్ గా ఉంటుంది.

కాసేపు మాత్రమే
ఒకవేళ వెల్లకిలా పడుకోవడానికి మీరు ఇష్టపడితే.. కాసేపు మాత్రమే అలా పడుకోవాలి. ఎక్కువ సమయం స్ట్రెయిట్ గా పడుకోకూడదు.



Click it and Unblock the Notifications