Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
గర్భిణీలు ఫ్రూట్స్ ఎక్కువ తింటే పుట్టే పిల్లల్లో ఐక్యూ పెరుగుతుందా?
గర్భం ధరించిన తర్వాత ఏదైనా ఆహారాన్ని తినాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎందుకంటే గర్భిణీ తీసుకొనే ఆహారం మీద బిడ్డ యొక్క ఎదుగుదల మరియు తల్లి యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మొదటి సారి గర్భం ధరించినట్టైతే, కడుపులోని బిడ్డ ఎదుగుదల తల్లి ఏరకమైన ఆహారాలు తింటోంది? అనే దానిపై ఉంటుంది. గర్భవతి దశలో మహిళ తన ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. సరైన ఆహారం తినకపోతే, కొన్ని సార్లు గర్భవిచ్ఛిన్నం కూడా అయ్యే అవకాశం ఉంటుంది.
ప్రెగ్నెన్సీ డైట్ లో ఆరోగ్యకరమైన మరియు పూర్తి పోషకాలున్న ఆహారాలకు ప్రాధానత్య కల్పించడం వల్ల తల్లికి రోజూ కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. హెల్తీ ఫుడ్స్ అంటే ఆకుకూరలు, బ్రొకోలి, పెరుగు, రెడ్ బెల్ పెప్పర్, సోయా ప్రొడక్ట్స్, బీన్స్, ఓట్ మీల్, నట్స్, గుడ్లు, మరియు క్యారెట్స్ వంటివి గర్బాధారణ సమయంలో తప్పనిసరిగా తీసుకోవల్సిన ఆహారాలు.

పండ్ల కథ ఏంటి?చాలా మంది గర్భధారణ సమయంలో కొన్ని రకాల పండ్లు అంటే బొప్పాయి, పైనాపిల్ వంటివి తినడానికి చాలా భయపడుతుంటారు. నిపుణులు అభిప్రాయం ప్రకారం గర్భధారణ సమయంలో తల్లి తినే ఆహారాల ప్రభావం బిడ్డ మీద పూర్తిగా ఉంటుంది. కాబట్టి, బేబీ స్మార్ట్ గా పుడతారు!ముఖ్యంగా తల్లి తినే ఫ్రూట్స్ కి, బేబీ ఐక్యూ లెవల్స్ ను మద్య దగ్గరి సంబంధం ఉంది.

రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల ప్రకారం, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటారో వారి పిల్లలు చాలా చురుగ్గా ఉంటారని కనుగొన్నారు. ఒక సంవత్సరంలో పిల్లల మీద జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్లు గుర్తించారు .

600మంది పిల్లలు మరియు వారి తల్లుల మీద జరిపిన పరిశోధనల్లో ఈ విషయం నిర్ధారించారు. గర్భధారణ సమయంలో ఫ్రూట్స్ ఎక్కువగా తిన్న వారి పిల్లల్లో ఐక్యూ లెవల్స్ కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ లేదా ఇతర అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కంటే, ఫ్రెష్ గా ఉండే రియల్ ఫ్రూట్స్ తినడం ఉత్తమం. అయితే ప్రస్తుత ఆరోగ్య స్థితి గతులను బట్టి ఎలాంటి ఫ్రూట్స్ తినాలి, ఎలాంటి ఫ్రూట్స్ తినకూడదో డాక్టర్స్ ను అడిగి తెలుసుకోవాలి.

అలాగే, షుగర్ కంటెంట్ అధికంగా ఉండే జ్యూస్ లకు దూరంగా ఉండాలి. ఫ్రూట్ జ్యూస్ లు ఫ్రెష్ గా ఉన్నా, వాటిలో ఉపయోగించే షుగర్ కెంటెంట్ వల్ల గర్భిణీలో ఇతర సమస్యల వచ్చే అవకాశం ఎక్కువ . ముఖ్యంగా ప్యాక్ చేసిన ఇన్ స్టాంట్ జ్యూసులకు దూరంగా ఉండాలి. ఇలా ప్యాక్ చేసిన వాటిలో ఇతర నిల్వచేసే పదార్థాలను జోడించడం వల్ల అది తల్లి బిడ్డలిద్దరికి హాని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications