Latest Updates
-
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి!
గర్భిణీలు గ్రీన్ టీ తాగడం వల్ల పొందే 6 అద్భుత ప్రయోజనాలు..!
గతంలో గ్రీన్ టీని గర్భిణీ స్త్రీలు కూడా తావచ్చని, గ్రీన్ టీ లో అనేక ఔషధ గుణాలున్నాయని, గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో గ్రీన్ టీ త్రాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అంటు
ప్రస్తుత రోజుల్లో మహిళలు చాలా యాక్టివ్ గా కనబడుతారు . వారి ఆరోగ్యం గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల హెల్తీగా కనబడుతారు. హెల్తీగా..ఫిట్ గా కనబడుటకు వ్యాయామం, హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం చేస్తుంటారు. అయితే గ్రీన్ టీ తాగవచ్చా..? ముఖ్యంగా మహిళ గర్భం పొందిన తర్వాత గ్రీన్ టీ తాగొచ్చా..?
సాధారణంగా చాలా మంది మహిళలకు గర్భం ధరించే వరకూ ఎటువంటి ఆంక్షలు ఉండవు. వారు ఏపనులైన చకచక చక్కబెట్టేస్తారు. ఎటువంటి ఆహారాన్నైన చక్కగా తినేసి జీర్ణించుకోగల శక్తి వారిలో ఉంటుంది. ఒక్కసారి మహిళ గర్భం ధరించిన తర్వాత చేసే పనుల్లో మరియు తినే తిండిలో చాలా ఆక్షలు విధిస్తుంటారు. తల్లితో పాటు కడుపులో పెరిగే శిశువు యొక్క ఆరోగ్యం క్షేమంగా ఉండాలని అలా సలహాలు ఇస్తుంటారు.
అయితే కొన్ని సంవత్సరాల పాటు ఉన్న అలవాట్లను సడన్ గా మానుకోవాలన్నా కొత్త పద్దతులను పాటించాలన్నా గర్భిణీ స్త్రీ మనస్సులో అనేక సందేహాలు ఏర్పడుతాయి. అటువంటి సందేహాల్లో ఒక్కటి, గ్రీన్ టీ. గర్భిణీ స్త్రీ గ్రీన్ టీ త్రావచ్చా? గ్రీన్ టీ వల్ల భద్రత మరియు ఆరోగ్య అంశాలను గురించి తెలుసుకొని డాక్టర్ సలహా ప్రకారం తాగాల్సి ఉంటుంది.
గతంలో గ్రీన్ టీని గర్భిణీ స్త్రీలు కూడా తావచ్చని, గ్రీన్ టీ లో అనేక ఔషధ గుణాలున్నాయని, గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో గ్రీన్ టీ త్రాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు నిపుణులు. గర్భిణీలు ఏది తీసుకున్నా మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రీన్ టీని గర్భిణీలు తాగకూడదని ఎలాంటి అఫిషియల్ వార్నింగ్ అంటూ లేదు.
కాబట్టి, గర్భిణీలు కూడా ఒకటి రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. గ్రీన్ టీ తాగడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. గర్భిణీ ఆరోగ్యం నార్మల్ గా ఉన్నప్పుడు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. గర్భిణీ గ్రీన్ టీ తాగడం వల్ల పొందే ప్రయోజనాలు ..

బ్లడ్ ప్రెజర్ :
గర్భధారణ సమయంలో బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడానికి గ్రీన్ టీ సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫాలీఫినాల్స్ బాడీలో సెల్ డ్యామేజ్ అవ్వకుండా నివారిస్తుంది. దాంతో ప్రెజర్ తగ్గిస్తుంది.

దంతాల నొప్పిని తగ్గిస్తుంది:
పంటి నొప్పితో బాధపడుతున్నారా? అయితే రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల హెల్తీ గమ్స్ పొందుతారు. గ్రీన్ టీలో ఉండే క్యాటచిన్స్, చిగుళ్ళు, దంత సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియా మరియు వైరస్ ను తొలగిస్తుంది.

డిప్రెషన్ :
గర్భధారణ సమయంలో హార్మోన్స్ అసమతుల్యతలు సహజం. హార్మోనుల ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో డిప్రెషన్ కు దారితీస్తుంది. గ్రీన్ టీలో ఉండే థైయమిన్ అనే అమినో యాసిడ్స్ రిలాక్సింగ్ ఎఫెక్ట్స్ ను అందిస్తుంది. దాంతో డిప్రెషన్ ను తగ్గించుకోవచ్చు.

చర్మ సంరక్షణ:
గర్భధారణ సమయంలో హార్మోనుల ప్రభావం వల్ల చర్మ సమస్యలు, మొటిమల సమస్యలుంటాయి. ఈ సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల అందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటీరీ గుణాలు ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

డయాబెటిస్:
గర్భధారణ సమయంలో అబ్ నార్మల్ గా స్వీట్స్ మీద ఎక్కువ కోరికలను కలిగి ఉంటారు. స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల జస్టేషనల్ డయాబెటిస్ కు గురి అవుతారు. కాబట్టి, ఈ సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల జస్టేషనల్ డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చు.

గర్భిణీలో ఫోలీక్ యాసిడ్స్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది:
గ్రీన్ టీ తాగడం పెరిగినప్పుడు శరీరంలోని ఫోలిక్ యాసిడ్ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. ఫొల్లేట్ లోపం వల్ల శిశువు యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ ట్యూబ్ పూర్గిగా మూసుకుపోవచ్చు దాంతో వెన్నెముక చీలిక, నాడీ సంబంధ నాళిక లోపాలకు కారణం కావచ్చు. కాబట్టి, గ్రీన్ టీని పరిమితంగా తీసుకోవడం మంచిది



Click it and Unblock the Notifications