Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
గర్భాధారణ సమయంలో వాల్ నట్స్ తింటే పొందే ఆరోగ్య లాభాలు...
గర్భధారణ సమయంలో గర్భిణీలు తీసుకొనే ఆహారం మీద ఎక్కువ జాగ్రత్తలు కలిగి ఉండాలి. . గర్భిణీలు ఎలాంటి ఆహారం తీసుకొన్నా, మంచి, చెడు ప్రభావాలు కడుపులో పెరిగే బిడ్డ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపెడుతాయి . గర్భినీలు తీసుకొనే రెగ్యులర్ ఆహారంలో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ పోషకాలు కడుపులో పెరిగే బేబీకి కూడా అందుతుంది. అంతే కాదు గర్భిణీలు న్యూట్రీషియన్ ఫుడ్స్ ను డబుల్ గా తీసుకోవాలి. ఒకటి వారికోసం, మరొకటి కడుపులో పెరిగే వారి బేబీకోసం న్యూట్రీషియన్ ఫుడ్ ను పెంచాలిః
మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి
లేదంటే, తల్లి లో బ్లడ్ కౌంట్ తో బాధపడాల్సివస్తుంది. మరియు విటమిన్, న్యూట్రీషియన్ లోపంతో బాధపడాల్సి వస్తుంది. తల్లైన వారు తీసుకోవల్సిన ఆహారాలు చాలనే ఉన్నాయి . అలాంటి హెల్తీ ఫుడ్స్ లో వాల్ నట్ ఒకటి.. ఎందుకంటే వాల్ నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినిరల్స్, యాంటీయాక్సిడెంట్స్ మొదలగునవి పుష్కలంగా ఉన్నాయి.ఇవన్నీ కూడా మదర్ తో పాటు పొట్టలో పెరిగే బేబీకి కూడా చాలా అవసరం అవుతాయి.
గర్భిణీ స్త్రీలు ఎండు ద్రాక్ష తినడం వల్ల పొందే గొప్ప ప్రయోజనాలు
అలాగని ఎక్కువ తీసుకోవడానికి లేదు, పరిమితంగా డాక్టర్ సలహా ప్రకారం తీసుకోవాలి. గర్భాధారణ సమయంలో మోతాదుకు మించి తీసుకోవడం వల్ల తల్లితో పాటు బిడ్డకు కూడా హాని కలుగుతుంది . ఈ ఆర్టికల్లో గర్భిణీలు వాల్ నట్స్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. మరి అవేంటో చూద్దాం...

బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్:
వాల్ నట్స్ లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు సహాయపడుతుంది. బ్రెయిన్ పవర్ మెరుగుపరుస్తుంది . ఇంకా ఇందులో ఉండే పొటాషియం, సెలీనియం, క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్ , మాంగనీస్, జింక్ వంటివన్నీ కూడా బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు సహాయపడుతాయి.

గర్భధారణ సమయంలో హైబ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది
గర్భధారణ సమయంలో వాల్ నట్స్ తినడం వల్ల హైబ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. దాంతో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. శరీరంలో మంచి ఫ్యాట్ ను పెంచుతుంది. దాంతో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

బేబీ పెరుగుదలకు
వాల్ నట్స్ లో ఉండే కాపర్ ఫీటస్ నార్మల్ గా అభివ్రుద్ది చెందడానికి సహాయపడుతుంది . ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఆల్ఫా లినోలిక్ యాసిడ్ బేబీ బోన్ మరియు దంతాల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

మదర్స్ ఇమ్యూనిటిని పెంచుతుంది:
గర్భధారణ సమయంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర చిన్న చిన్న వ్యాధులను ఎదుర్కోవడానికి అవసరమయ్యే ఇమ్యూనిటిని పెంచడంలో వాల్ నట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . వాల్ నట్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఇ, ఫాలీఫినాల్స్ , కాపర్ మొదలగునవి వ్యాధినిరోధకశక్తి పెంచుతాయి.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది
వాల్ నట్స్ ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఇది బేబీకి ఎక్కువ బ్లడ్ సప్లై చేస్తుంది మరియు దాంతో బేబీ ఎక్కువ ఆక్సిజ్ మరియు న్యూట్రీషియన్స్ మదర్స్ బాడీ నుండి అందుతుంది.

బరువును కంట్రోల్ చేస్తుంది:
వాల్ నట్స్ లో ప్రోటీన్స్ మరియు ఫైబర్ అధికంగా ఉన్నాయి . ఇవి టేస్ట్ మరియు పొట్టను నింపినట్లు సాటిస్ఫ్యాక్షన్ చేయడమే కాకుండా అధికబరువు పెరగకుండా చేస్తుంది . అలాగే గర్భాధారణ సమయంలో అనారోగ్యకరమైన షుగర్ ఫుడ్స్ తినకుండా ఆకలికానివ్వకుండా చేస్తుంది . దాంతో గర్భాధారణ సమయంలో వచ్చే డయాబెటిస్ ను నిరోధించవచ్చు. కాబట్టి, గర్భాధారణలో కూడా వాల్ నట్స్ మితంగా తినవచ్చు

మంచి నిద్ర పడుతుంది
గర్భాధారణలో వాల్ నట్స్ తినడం వల్ల మంచి నిద్రపడుతుంది. కారణం వాల్ నట్స్ లో ఉండే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కి సహాయపడుతంది . ఇది మంచి నిద్రపట్టడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications