Latest Updates
-
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.! -
అన్నీ ఇచ్చాక కూడా ప్రేమ మారిపోయిందా? దానికి కారణం మీరు కాదు -
మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ 4 ఫ్రూట్స్‌తో ప్రమాదాన్ని అరికట్టొచ్చా.? -
జూన్ 5, 2026: గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి అదృష్టం, ధనయోగం ఖాయం! -
ఎలాంటి విషాన్నైనా మింగేస్తుంది.. ఆరోగ్యానికి సంజీవని నేరేడు పండ్ల ప్రయోజనాలు తెలుసా.! -
రొటీన్ కాఫీకి గుడ్ బై చెప్పండి.. ఈ టేస్టీ అండ్ హెల్తీ బనానా కాఫీ ట్రై చేయండి! -
జూన్ 5న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ పనులు చేస్తే మీ కెరీర్, బిజినెస్ లో తిరుగుండదు!
ఈ క్యాల్షియం ఫ్రూట్స్ గర్భిణీలకు తప్పనిసరి..!!
క్యాల్షియం తల్లి, బిడ్డకు చాలా ముఖ్యమైన పోషకాంశంగా గుర్తించాలి. ప్రెగ్నెన్సీ డైట్ లో క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం చాలా కీలకం. చాలా మంది మహిళలు క్యాల్షియం ఒక ఆహారంలోనే లేదా పానియాలలో ఉందను
మహిళ గర్భం పొందగానే ఒక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు. ఆ తీసుకొనే ఆహారం ద్వారా ఆ గర్భిణీకి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ మరియు మినిరల్స్ చాలా అవసరం. ఇవన్నీ విమిళితమై ఉన్న ఆహారానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు, పిండిం ఆరోగ్యంగా పెరుగుదలకు, ఎదుగుదలకు అవసరం అయ్యే ఒక ముఖ్యమైన పోషకాంశం క్యాల్షియం.
గర్భం ధరించిన మొదటి మూడు నెలలో చాలా ముఖ్యమైన దశ. గర్భం ధరించిన ప్రారంభ దశలో శరీరానికి కావల్సిన పోషకాహారాల అవసరాలను గుర్తించి జాగ్రత వహించాలి. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ప్రత్యేకంగా నిబంధనలతో ప్రెగ్నెన్సీ డైయట్ ను ఫాలో అవ్వాలి. ఎందుకంటే మొదటి మూడు నెలల్లో గర్భం ప్రోటీన్ మరియు క్యాల్షియం ఆహారాలను ప్రధానంగా చేసుకుంటుంది. ఇవి గర్భంలోని బిడ్డ వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. అంతే కాదు బిడ్డలో ఎముకలు మరియు దంతాలు బలంగా ఏర్పడటానికి, శిశువు పెరుగుదలకు చాలా అవసరం.
గర్భిణీలకు ఎట్టి పరిస్థితిలో చెప్పకూడని విషయాలు..!
అంతే కాదు, ఇటు తల్లికి, అటు బిడ్డకు ఆరోగ్యకరమైన గుండె, నరాలు మరియు కండరాల బలానికి ఇటువంటి పోషకాంశాలు చాలా బాగా సహాయపడుతాయి. గర్భధారణ సమయంలో మీరు క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవకపోతే, తల్లి నుండి శిశువు పూర్తిగి గ్రహించబడుతుంది. దాంతో తల్లిలో క్యాల్షియం లోపం ఏర్పడి తల్లి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
గర్భిణీలు కంపల్సరీ తినాల్సిన క్యాల్షియం ఫుడ్స్ ..!!
కాబట్టి, క్యాల్షియం తల్లి, బిడ్డకు చాలా ముఖ్యమైన పోషకాంశంగా గుర్తించాలి. ప్రెగ్నెన్సీ డైట్ లో క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం చాలా కీలకం. చాలా మంది మహిళలు క్యాల్షియం ఒక ఆహారంలోనే లేదా పానియాలలో ఉందను కొంటారు. అయితే క్యాల్షియం ఒక్క డైరీప్రొడక్ట్స్ లో మాత్రమే కాదు, పండ్లలో కూడా కాల్షియం ఉంటుందని గ్రహించాలి. కాబట్టి, గర్భధారణ సమయంలో మీరు పండ్లను ఎక్కువగా ఇష్టపడితే వాటిలో తాజా పండ్లు ముఖ్యంగా క్యాల్షియం అధికంగా ఉండే పండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మరి అటువంటి క్యాల్షియం అధికంగా ఉండే పండ్లు ఏంటో ఒక సారి క్రింది లిస్ట్ ద్వారా తెలుసుకోండి..మీ ఆరోగ్యం, మీ శిశువు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి..

ఎండిన అంజూర(ఫిగ్):
ఒక కప్పు ఎండిన అంజూర పండ్లతో 241 క్యాల్షియం పొందవచ్చు. అంతే కాదు వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు జింక్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీని ఆరోగ్యాంగా ఉంచుతాయి.

ఖర్జూరం:
గతంలో, ఈ ఖర్జూరాలను గర్భిణీ తినడం వల్ల ప్రసవ సమయం తగ్గిస్తుందని ఓ అపోహ ఉండేది. కానీ ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంది. ఒక్క కర్జూరంలో 15.36mg కాల్షియం ఉంది.

కుంక్వాట్స్(Kumquats):
ఇది కాల్షియం అధికంగా ఉండే ఒక పండు. ఈ పండును గర్భధారణ సమయంలో తినవచ్చు మరియు పోస్ట్ నేటల్ డైట్ లిస్ట్ లో కూడా చేర్చుకోవచ్చు .

డ్రై ఆప్రికోట్:
గర్భిణీ స్త్రీలకు ఇది ఒక అద్భుతమైన కాల్షియం అధికంగా ఉండే ఒక సూపర్ ఫ్రూట్. ఎండిన ఆప్రికోట్ లో ఇంకా ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల, దీన్ని గర్భిణీకి ఒక హెల్తీ స్నాక్ గా చెప్పవచ్చు.

ఆరెంజ్:
ఆరెంజ్ లో విటమిన్ సి మరియు కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఇది తల్లిలో ఏర్పడే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగేందుకు రోగనిరోధక శక్తిని పెంపొంధిస్తుంది. మరియు ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.

ప్రూనే:
ప్రూనే అంటే ప్లమ్స్ ను ఎండిన తర్వాత వీటిని ప్రూనే అంటారు. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో మలబద్దకంతో బాధపడే గర్భిణీకి ఇది ఒక హోం రెమడీగా ఉపయోగపడుతుంది.

మల్బరీస్:
ఇది మరో క్యాల్షియ రిచ్ ఫ్రూట్. చాలా మంది ఈ మల్బరీస్ ను గర్భధారణ సమయంలో తినకూడదనుకుంటారు. కానీ కొంత మంది చాలా ఆరోగ్యకరం అంటారు . కాబట్టి వీటిని మీరు తినాలనుకునేటప్పుడు మీరు మీ డాక్టర్ ను సంప్రదించి తీసుకోవడం ఉత్తమం.

కివి:
గర్బధారణ సమయంలో ముఖ్యంగా తీసుకోవల్సిన మరో కాల్షియం రిచ్ ఫ్రూట్ కివి. కాల్షియం మాత్రమే కాదు ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంది.



Click it and Unblock the Notifications