Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
గర్భధారణ సమయంలో చిటికెడు బెల్లం తింటే పొందే వండలర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్
ప్రెగ్నెన్సీ డైట్ లో చేర్చుకోవాల్సి ఖచ్చితమైన ఆహారాల్లో బెల్లం ఒకటి. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి.. కాబోయే తల్లులు ఖచ్చితంగా తీసుకోవాలి. గర్భధారణ సమయంలో బెల్లం తినడం చాలా సేఫ్. ఐరన్ డె
ప్రెగ్నెన్సీ డైట్ లో చేర్చుకోవాల్సి ఖచ్చితమైన ఆహారాల్లో బెల్లం ఒకటి. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి.. కాబోయే తల్లులు ఖచ్చితంగా తీసుకోవాలి. గర్భధారణ సమయంలో బెల్లం తినడం చాలా సేఫ్. ఐరన్ డెఫిసియెన్సీ, అనీమియా వంటి రిస్క్ కి దూరంగా ఉండాలంటే.. బెల్లం తింటూ ఉండాలి.
బెల్లం తీసుకోవడం వల్ల కడుపులోని బిడ్డ హెల్తీ వెయిట్ మెయింటెయిన్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన బ్రెస్ట్ మిల్క్ కి ఇది సహాయపడుతుంది. 7నెలల ప్రెగ్నెన్సీ తర్వాత రెగ్యులర్ గా బెల్లం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, క్రోనిక్ డిసీజ్ లను నివారిస్తాయి. అలాగే బెల్లం చర్మానికి కూడా మంచిది. ప్రీరాడికల్స్ తో పోరాడి వయసు ఛాయలు కనిపించకుండా అరికడుతుంది. అంతేకాదు.. ప్రకాశవంతమైన చర్మ సౌందర్యం పొందడానికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు బెల్లం ఖచ్చితంగా తినాల్సిన అవసరమేంటో ఇప్పుడు చూద్దాం..

శరీరంలో రక్తం శుభ్రపరుస్తుంది:
గర్భధారణ సమయంలో.. బెల్లం తీసుకోవడం వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది.

గర్భిణీలో సాధారణంగా వచ్చే అనీమియాను నివారిస్తుంది:
బెల్లం తీసుకోవడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. దీనివల్ల అనీమియా రిస్క్ తగ్గించుకోవచ్చు. అలాగే ఇమ్యునిటీ పవర్ పెంచి.. అనేక హెల్త్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది.

కీళ్ల నొప్పుల తగ్గిస్తుంది:
బెల్లం తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్లకు పోషణ అందించి.. బలంగా చేస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో వేధించే కీళ్ల నొప్పులు నివారిస్తుంది.

శరీరంలో నీరు చేరకుండా వాపులను తగ్గిస్తుంది:
బెల్లంలో ఉండే పొటాషియం, మినరల్స్ శరీరంలో వాటర్ రిటెన్షన్ ను తగ్గిస్తుంది. అలాగే పొటాషియం ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. వాపు, నొప్పులను నివారిస్తుంది.

హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం :
బెల్లంలో ఫోలేట్ ఉంటుంది. గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో అవసరం. కడుపులో శిశువు ఎదుగుదల, పెరుగుదలకు సహకరిస్తుంది.

బీపీ కంట్రోల్ చేస్తుంది:
బెల్లంలో సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ రిస్క్, గుండె సంబంధిత సమస్యలని కూడా తగ్గిస్తుంది.

జీర్ణ సమస్యలను నివారిస్తుంది:
అల్లం ఎఫెక్టివ్ గా డైజెస్టివ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. గర్భధారణ సమయంలో స్మూత్ డైజషన్ పెంచుతుంది. అన్ రిఫైండ్ షుగర్స్ ను డైజెస్టివ్ ఎంజైమ్స్ కు ఉత్పత్తి చేస్తుంది. జీర్ణ సమస్యలను ఉత్పన్న కాకుండా నివారిస్తుంది.

చర్మ సమస్యలను నివారిస్తుంది:
గర్భధారణ సమయంలో చర్మ సమస్యలు సహజం. వీటిలో చిటికెడు బెల్లం తింటే ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ చర్మానికి పోషణను అందిస్తుంది, చర్మానికి తగిన విధంగా తేమను అందించి చర్మంను స్మూత్ గా గ్లోయింగ్ గా మార్చుతుంది. చర్మంలో ముడుతలను మచ్చలను మాయం చేస్తుంది.



Click it and Unblock the Notifications