Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
వావ్: తల్లి మొక్కజొన్నతింటే, బిడ్డకు ఎక్కువ మేలు చేస్తుందా!!
వావ్: తల్లి మొక్కజొన్నతింటే, బిడ్డకు ఎక్కువ మేలు చేస్తుందా!!
ఆరోగ్య సంరక్షణ విషయంలో చాలా అపోహలుంటాయి. గర్భదారణ సమంయలో మరీ ఎక్కువగా ఉంటాయి. గర్భం పొందిన తర్వాత అనేక విషయాల పట్ల అవగాహనతో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా గర్బిణీ స్త్రీలు ఏం తినాలి? ఏం తినకూడు? ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం ఆమెతో పాటు కడుపులో పెరిగే బిడ్డకు కూడా చేరుతుంది. ఆమె శరీరం గ్రహించే పోషకాలే శిశువు అభివృద్దికి సహాపడుతుంది.
గర్భధారణ కాలం మొత్తం న్యూట్రీషియన్ డైట్ ను మెయింటైన్ చేయడం ఇటు తల్లికి...అటు పుట్టబోయే బిడ్డకు ఇద్దరిక చాలా ముఖ్యం. గర్భాదారణ సమయంలో గర్భిణీకి ఆహారాలపై ఎక్కువ కోరికలు ఉండటం సహజం. కానీ ఏ ఆహారం తీసుకున్నా అవి వారి ప్రెగ్నెన్సీ హార్మోనులపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, కొన్ని ప్రత్యేకమైన ఆహారాల పట్ల తప్పనిసరిగా అవగాహన ఉండాలి.
గర్భిణి తినవల్సిన ఆహారాల్లో ఒకటి మొక్కజొన్న. మొక్కజొన్న ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే తృణధాన్యాలు. పోషకాలతో నిండిన, క్రంచీ మరియు జ్యుసి మొక్కజొన్నను గర్భిణిస్త్రీకి తినాలనే కోరిక కలగడం విలువైనది. కానీ గర్భధారణ సమయంలో మొక్కజొన్న తినడం సురక్షితమేనా? అంటే..
ఖచ్చితంగా అవుననే చెబుతున్నారు న్యూట్రీషియన్ నిపులు. మొక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్, ఫైబర్, విటమిన్ బి1, బి5 మరియు మెగ్నీషియం, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో న్యూట్రీషియన్లు ఉండటం మాత్రమే కాదు, చాలా రుచికరమైనది కూడా. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తల్లిలో పాలఉత్పత్తిని పెంచుతుంది. తల్లి, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీ ఆహారంలో మొక్కజొన్న తప్పనిసరిగా తీసుకోవచ్చు.
మొక్కజొన్న తినడం వల్ల గర్భిణి పొందే ఆరోగ్య ప్రయోజనాలు:

మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది:
మొక్కజొన్నలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఇది సహాయపడుతుంది. మలబద్దకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

లియోనాటల్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది:
మొక్కజొన్నలో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డలో న్యూట్రల్ మాల్ ఫార్మేషన్ రిస్క్ ను తగ్గించడంలో ఉపయోగికారిగా పనిచేస్తుంది.

జ్ఝాపకశక్తి పెరుగుతుంది:
మొక్కజొన్నలో ఉండే థైమిన్ అనే విటమిన్ గర్భధారణ సమయంలో కడుపులో పెరుగుతున్న శిశువుకు ఆరోగ్యకరమైన బ్రెయిన్ డెవలప్ మెంట్ జరుగుతుంది.

సరైన మానసిక స్థితి:
మొక్కజొన్నలో ఉండే పాంథోజెనిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలో జరిగే అనేక శారీరక మార్పులు నార్మల్ గా జరగడానికి సహాయపడుతుంది.

మాస్కులార్ డిజనరేషన్
ప్రెగ్నెన్సీ సమయంలో మొక్కజొన్న తినడం వల్ల మాస్కులర్ డీజనరేషన్ నుండి సురక్షితంగా కాపాడుతుంది.

బేబీ కంటి చూపు మెరుగుపరుస్తుంది:
మొక్కజొన్నలో ఉండే టూటిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుట్టబోయే బిడ్డకు కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రక్తహీనతను నివారిస్తుంది.
మొక్కజొన్నలో విటమిన్ బి12 అధికంగా ఉండటం వల్ల రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది . దాంతో గర్భిణీలో అనీమియా నివారించబడుతుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది:
మొక్కజొన్నలో బీటాకెరోటిన్ అధింగా ఉండటం వల్ల , అది విటమిన్ ఎ గా మారి ఆరోగ్యకరమైన చర్మం ఇస్తుంది. వ్యాధినిరోధకత పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో జ్ఝాపకశక్తి బాగుంటుంది.

మంచి కొలెస్ట్రాల్ :
గర్భదారణ సమయంలో కార్న్ హస్క్ ఆయిల్ వాడటం వల్ల రక్తంలో ప్లాస్మా ఎల్ డిఎల్ తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను నింపుతుంది.

చర్మం మరియు జుట్టుకు మంచిది
గర్భిణీలు స్వీట్ కార్న్ తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్ బి1 మరియు బి5 చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications