Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా..
సాధారణంగా మనకు బలం అంటే..మాంసాహారం,గుడ్లు గుర్తుకొస్తాయి. అయితే పచ్చికొబ్బరిలో మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం ఉంటుంది. 100 గ్రాముల పచ్చికొబ్బరి తీసుకుంటే 440 క్యాలరీల శక్తి లభిస్తుంది. అదే 100 గ్రాముల కోడిమాంసం ద్వారా 110 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది.
పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు లేదా ఎక్కువ కష్టపడి పనిచేసేవాళ్లు, జిమ్ కు వెళ్లేవాళ్లు ప్రతిరోజూ అర చెక్క పచ్చికొబ్బరిని ఏదో ఒక రూపంలో మీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది. అయితే ఇదే సమచయంలో పచ్చికొబ్బరితో టేస్టీ లడ్డు చేసుకుంటే ఇంకా అదిరిసోతుంది. టేస్ట్ తో పాటు ఆరోగ్యానికి బోలెడంత మేలు జరుగుతుంది. పచ్చి కొబ్బరి లడ్డు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పచ్చికొబ్బరి లడ్డు తయారీకి కావాల్సినవి
-బెల్లం తురుము
-నువ్వులు
-నెయ్యి
-పచ్చికొబ్బరి తురుము
-బాదం పప్పులు
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పచ్చికొబ్బరి లడ్డు తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోండి. బాండీలో 1 కప్పు తెల్ల నువ్వులు వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ నీళ్లు పోసుకోండి. నువ్వులను దోరగా రంగు మారేదాకా వేయించాలి. తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో వేసి పౌడర్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే బాండీలో ఒక చెంచా నెయ్యి వేసి అందులో బాదం ముక్కలు వేసి బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న బాండీలోనే 1 కప్పు బెల్లం తురుము వేసి కరిగించాలి. బెల్లం బాగా కరిగాక అందులో ఒక గిన్నె పచ్చికొబ్బరి తురుము వేసి కలుపుకోండి. బాగా కలుపుకున్నాక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి.
-చివరగా అందులో నెయ్యిలో వేయించిన బాదం ముక్కలను వేసి కలుపుకొని స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి. మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని లడ్డుల్లా చుట్టుకోండి. అంతే పచ్చికొబ్బరి లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications