Latest Updates
-
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..!
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి
కేవలం వానాకాలం సీజన్ లో మాత్రమే దొరికే అరుదైన, అత్యంత రుచికరమైన కూరగాయ బోడకాకరకాయ. దీనిని ఆగాకరకాయ అని కూడా అంటారు. దీని రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువే. ఇది చర్మ వ్యాధులతో పాటు అనేక వ్యాధులను నివారిస్తుంది. చికెన్, మటన్ కంటే 50 రెట్లు ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది.
ఆయుర్వేదంలో దీనిని అత్యంత శక్తివంతమైన కూరగాయ అని పిలుస్తారు. అయితే ఈ సీజన్ లో మాత్రమే దొరికే వీటిని కొద్ది రోజులు మాత్రమే తిని సరిపెట్టుకుంటే ఎలా? ఏడాది పొడవునా ఆ అద్భుతమైన రుచిని ఆస్వాదించాలంటే నిల్వ పచ్చడి చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. సరైన కొలతలతో సంవత్సరం పాటు నిల్వ ఉండేలా బోడకాకరకాయ పచ్చడి మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

బోడకాకరకాయ నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
బోడకాకరకాయలు - అర కిలో
పల్లీ నూనె (వేరుశెనగ నూనె)-తగినంత
పచ్చడి కారం - తగినంత
ఉప్పు - సరిపడా
పసుపు - అర టీస్పూన్
మెంతిపొడి - 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - గుప్పెడు
నిమ్మకాయలు - రెండు
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి!
బోడకాకరకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం
-ముందుగా బోడకాకరకాయలను రెండు మూడు సార్లు నీళ్లలో శుభ్రంగా కడుక్కోవాలి. తడి లేకుండా వాటిని పొడి గుడ్డతో తుడిచి, గాలికి ఆరబెట్టాలి.
-తడి పూర్తిగా ఆరిన తర్వాత, కాయలకు పై భాగంలో, అడుగు భాగంలో ఉన్న తొడిమలను కత్తిరించాలి. ఆ తర్వాత వీటిని మరీ చిన్నవి కాకుండా, ఒక మోస్తరు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని, పల్లీ నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక, కట్ చేసుకున్న బోడకాకరకాయ ముక్కలను అందులో వేసి దోరగా వేయించుకోవాలి. ముక్కలు కాస్త క్రిస్పీగా మారాక వాటిని నూనెలోంచి బయటకు తీసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి.
-వేయించిన బోడకాకరకాయ ముక్కలలో రుచికి సరిపడా ఉప్పు, కారం, చిటికెడు పసుపు, మెంతులను దోరగా వేయించి చేసుకున్న మెంతిపొడి వేసి ముక్కలన్నింటికీ మసాలాలు బాగా పట్టేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఒక చిన్న పాన్ లో కొద్దిగా పల్లీ నూనె తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలను వేసి దోరగా వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలను నూనెతో సహా తీసి పచ్చడి మిశ్రమంలో పోసి అన్నీ కలిసేలా బాగా కలపాలి.
-పచ్చడి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే అందులో నిమ్మరసం పిండుకోవాలి వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే చేదు వస్తుంది. చివరగా పచ్చడి నిల్వ ఉండటానికి సరిపడా మరికొంత పల్లీ నూనెను వేసి పైకి కిందకి బాగా కలుపుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే బోడకాకరకాయ నిల్వ పచ్చడి రెడీ. దీనిని తడి లేని ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే, రెండు మూడు రోజుల తర్వాత ముక్కకు ఉప్పు, కారం, పులుపు పట్టి రుచి అద్భుతంగా తయారవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
