కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి!

Posted By:

మన ఇంట్లో వంట చేసేటప్పుడు ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే నూనె కాస్త ఎక్కువ పడుతుంటుంది. గుమగుమలాడే కూరలు, గ్రేవీలు లేదా ఇష్టమైన పకోడీలు వండినప్పుడు, వాటిపై తేలుతున్న నూనెను చూస్తే తినకముందే కడుపు నిండినట్లు, ఆహారం బరువుగా అనిపిస్తుంది.

అదనపు నూనె వల్ల ఆరోగ్యం పాడవుతుందనే భయంతో కొందరు ఆ వంటకాలను తినకుండా పారేస్తుంటారు. కానీ వంటకం రుచి ఏమాత్రం మారకుండా, ఎక్స్‌ ట్రా నూనెను సులభంగా వదిలించుకునే అద్భుతమైన చిట్కాలు ఇక్కడ చూడండి.

Added Too Much Oil in Curries and Gravies Here s How to Remove It Without Losing the Taste

గరిటెతో సులభంగా తీసేయండి

కూర వండటం పూర్తయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఓ ఐదు నిమిషాల పాటు కదపకుండా ఉంచండి. అప్పుడు నూనె అంతా పైకి తేలి మందపాటి పొరలా ఏర్పడుతుంది. ఒక వెడల్పాటి గరిటె తీసుకుని, గ్రేవీ రాకుండా కేవలం నూనెను మాత్రమే నెమ్మదిగా తీసేయండి.

ఐస్ క్యూబ్ మ్యాజిక్

ఒక గుండ్రటి గరిటెలో రెండు ఐస్ క్యూబ్స్ వేసి, ఆ గరిటె అడుగు భాగాన్ని కూరపై తేలుతున్న నూనెకు మెల్లగా తాకించండి. ఆ చలికి నూనె గడ్డకట్టి గరిటెకు అతుక్కుంటుంది. దాన్ని శుభ్రం చేసి మళ్లీ ఇలాగే చేయండి. అయితే ఐస్‌ ను నేరుగా కూరలో వేయకండి, దానివల్ల గ్రేవీ రుచి మారుతుంది.

బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది!

ఫ్రిజ్‌ లో పెట్టి చూడండి

కూరలో నూనె ఎక్కువగా ఉండి, గరిటెతో తీయడం కష్టంగా అనిపిస్తే దాన్ని పూర్తిగా చల్లారనిచ్చి కాసేపు ఫ్రిజ్‌ లో పెట్టండి. కొద్దిసేపటికి నూనె గట్టిపడి పైన ఒక పొరలా మారుతుంది. దాన్ని ఈజీగా తీసేసి, కూరను మళ్లీ వేడి చేసుకుని ఆస్వాదించండి.

వేయించిన స్నాక్స్‌కి పేపర్ టవల్స్

పూరీలు, పకోడీలు, బజ్జీలు వేయించాక వాటికి నూనె ఎక్కువగా అంటుకుని ఉంటుంది. వాటిని నేరుగా ప్లేట్‌ లో కాకుండా కిచెన్ పేపర్ టవల్‌ పై వేసి తేలికగా అద్దండి. ఎక్స్‌ ట్రా నూనెను ఆ పేపర్ పీల్చేసుకుంటుంది. మరీ గట్టిగా నొక్కితే వాటి కరకరలాడే గుణం పోతుంది కాబట్టి సున్నితంగా అద్దాలి.

ముక్కలను వేరు చేయండి

నాన్ వెజ్ లేదా పనీర్ లాంటివి వండినప్పుడు గ్రేవీలో నూనె బాగా కనిపిస్తుంటే.. చిల్లుల గరిటెతో కేవలం కూరగాయలు లేదా మాంసం ముక్కలను మాత్రమే తీసి మరో గిన్నెలోకి మార్చుకోండి. ఇలా చేస్తే రుచి దెబ్బతినదు, అదనపు నూనె కడుపులోకి వెళ్లదు.

ఫ్యాట్ సెపరేటర్ వాడండి

మీరు ఇంట్లో ఎక్కువగా సూప్‌ లు, లిక్విడ్ గ్రేవీలు చేస్తుంటే ఫ్యాట్ సెపరేటర్ అనే పరికరం భలే ఉపయోగపడుతుంది. ఇది నూనెను పైకి తేలేలా చేసి, అడుగున ఉన్న స్వచ్ఛమైన సూప్‌ను మాత్రమే మనకు అందిస్తుంది.

పదార్థాలను పెంచి బ్యాలెన్స్ చేయండి

ఒకవేళ నూనె కూరలో బాగా కలిసిపోయి తీయడానికి వీలుకాకపోతే, ఉడికించిన బంగాళదుంపలు, కూరగాయలు లేదా కొద్దిగా పప్పును కలపండి. ఇవి నూనెను పీల్చుకుని కూరను బ్యాలెన్స్ చేస్తాయి. అవసరాన్ని బట్టి కాస్త ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 9, 2026, 21:18 [IST]
Desktop Bottom Promotion