బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది!

Posted By:

మన తెలుగు వాళ్లు ఉదయాన్నే ఎక్కువగా తినే బ్రేక్ ఫాస్ట్ లలో పూరీ కూడా టాప్ ప్లేస్ లో ఉంటుంది. వేడి వేడి పూరీలను ఆలూ కర్రీతో తింటుంటే ఆ మజానే వేరు. అయితే ఎప్పుడూ ఒకే రకం పూరీలు టేస్ట్ చేసి ఆ ఏముందులే ఇందులో పెద్ద అని అనిపించిందా?

అయితే ఒక్కసారి బెంగాలీ స్టైల్ రాధాభల్లవి పూరీలు ట్రై చేసి చూడండి..స్వర్గం పైన కాదు ప్లేట్ ఉందని అనిపిస్తుంది. అంత కమ్మగా, రుచిగా ఉంటాయి. బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ మీ ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Step by Step Guide to Making Soft Tasty Bengali Special Radhaballavi Puri at Home in Telugu

రాధాభల్లవి పూరీ తయారీకి కావాల్సిన పదార్థాలు

-మైదా పిండి
-నూనె
-ఉప్పు
-మినపప్పు
-అల్లం
-పచ్చిమిరపకాయ
-కలోంజి
-సోంపు
-ఇంగువ
-పసుపు
-కారం
-వేయించిన జీలకర్ర పొడి

మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి

రాధాభల్లవి పూరీ తయారీ విధానం

-ముందుగా అర కప్పు మినపప్పును శుభ్రంగా కడిగాక,నీళ్లు పోసి 4-5 గంటలు నానబెట్టుకోవాలి.

-తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో పావుకేజీ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల నూనె, చిటికెడు ఉప్పు వేసి పిండిని బ్రెడ్ పొడిలా అయ్యేలా బాగా చేత్తో కలపండి. తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా క్రాక్స్ లేకుండా వచ్చేవరకు ప్రెజర్ ఇస్తూ 5 నిమిషాలు వత్తుకోవాలి. పిండి సాఫ్ట్ గా, స్మూత్ గా, క్రాక్స్ లేకుండా ఉండాలి.

-కలుపుకున్న పిండిపై తడిగుడ్డ కప్పి అరగంట సేపు పక్కన ఉంచాలి.

-తర్వాత మిక్సీ గిన్నెలో 4-5 గంటల సేపు నానబెట్టుకున్న మినపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండి స్మూత్ గా, గట్టిగా ఉండాలి.

మరో మిక్సీ గిన్నెలో 8 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్కలు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత స్టఫింగ్ కోసం.. స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక అందులో పావు టీస్పూన్ కలోంజి(ఉల్లి గింజలు), 1 టీస్పూన్ సోంపు వేసి సోంపు చిటపటలాడేవరకు వేయించాక ఇందులో గ్రైండ్ చేసుకున్న అల్లంపచ్చిమిర్చి పేస్ట్ రెండున్నర టేబుల్ స్పూన్లు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. తర్వాత ఇందులో రెండు చిటికెళ్ల ఇంగువ, పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు వేసి వేయించాలి.

-వేగిన మసాలాలలో గ్రైండ్ చేసుకున్న మినపపిండి వేసి చిక్కగా, ముద్దగా అయ్యి బాండీ నుంచి విడిపోయేదాకా కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆపేయండి. మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఇప్పుడు అరగంటసేపు పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఒక ప్లేట్ లో వేసుకోండి. వీటిపై కాస్త పొడి పిండి వేసి చల్లుకోండి.

-తర్వాత పిండిముద్దను చేతి మణికట్టుతో ఫ్లాట్ గా చేసుకోండి. తర్వాత ఉసిరికాయంత చల్లారిన మినపప్పిండి మిశ్రమాన్ని మైదాపిండి మధ్యలో పెట్టి చూపుడు వేలు, బొటనవేలు మధ్యన పెట్టి లోపలికి తోస్తూ ఉంటే మైదాపిండి సమాంతరంగా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత అంచులను ఒక దగ్గరికి చేర్చి సీల్ చేసి ఉండగా చేయండి. ఉండగా రోల్ చేసిన దాన్ని మళ్లీ ఫ్లాట్ గా సర్దితే లోపల స్టఫింగ్ సమాతరంగా స్ప్రెడ్ అవుతుంది. ఇదేవిధంగా,అన్నింటినీ చేసి పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ చేసుకున్న పిండి ముద్దలను ఎక్కువ పొడి పిండి చల్లుకుంటూ పూరీల్లా వత్తుకోవాలి.తర్వాత పూరీ మీద ఉండే పొడి పిండిని దులపండి.

-తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి బాగా వేడయ్యాక అందులో పూరీలను వేసి పొంగనిచ్చాక బయటకు తీసేంది. రాధాభల్లభి పూరీలు తెల్లగా ఉండాలి, ఎర్రగా వేగకూడదు.

-అంతే బెంగాలీ స్పెషల్ రాధాభల్లభి పూరీ రెడీ. వీటిని నచ్చిన సైడ్ డిష్ తో వేడి వేడిగా తింటుంటే స్వర్గమే అనిపిస్తుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 9, 2026, 7:26 [IST]
Desktop Bottom Promotion