గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్‌.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్‌.!

గర్భిణీలకు మొదటి నెల నుంచే భోజనంలో ఆరోగ్యకరమైన ఆహారం ఉండేలా చూడటం తప్పనిసరి. అలాంటి హెల్తీ ఫుడ్‌లో బీన్స్‌ ముందుంటుంది. బీన్స్ తినడం వల్ల కడుపులో శిశువు మెదడు అభివృద్ధికి, ఎముకల బలానికి దోహదపడుతుంది. ఇక, బంగాళాదుంపలు కూడా డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాలని డైటీషియన్లు సూచిస్తారు. అయితే ఈ రెండింటి కాంబినేషన్‌ ఎవర్‌ గ్రీన్‌ అనే విషయం తెలిసిందే. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే ఈ రెసిపీ తయారీలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీంతో తినేటప్పుడు వాటి రుచి తెలియకుండా ఉంటుంది. ఈ పద్ధతిలో చేశారంటే అందులోని పోషకాలు శరీరానికి సక్రమంగా అందుతాయి. ఆలూ బీన్స్‌ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం..

Aloo beans fry and curry for chapathi and rice healthy dish for pregnant

ఆలూ బీన్స్‌ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు

బంగాళాదుంప- మూడు
కట్‌ చేసి పెట్టుకున్న బీన్స్‌- కప్పు
ఉల్లిపాయలు- రెండు
టమాటాలు- రెండు
ఆవ నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు
దాల్చిన చెక్క- ఇంచు సైజు
లవంగాలు- మూడు
జీలకర్ర- టీస్పూన్‌
వెల్లుల్లి రెబ్బలు- ఆరు
తరిగిన అల్లం- టీస్పూన్‌
పచ్చిమిర్చి- మూడు
ఉప్పు- టీస్పూన్‌
పసుపు- పావు టీస్పూన్‌
కశ్మీరీ ఎర్ర కారం- టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్‌
జీలకర్ర పొడి- టీస్పూన్‌
ఇంగువ- పావు టీస్పూన్‌

ఆలూ బీన్స్‌ కర్రీ తయారీ విధానం

ముందుగా బంగాళాదుంపలను తొక్క తీసి మీడియం సైజులో కట్‌ చేసుకుని ఒక బౌల్‌లోని కొన్ని నీళ్లు, ఉప్పు వేసుకుని అందులో పది నిమిషాల పాటు ఉంచాలి. బీన్స్‌ను చిన్న ముక్కలుగా కట్‌ చేసి కడిగి పెట్టుకోవాలి.

పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!

స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో ఆవ నూనె వేసి కాగిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్‌ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి.

Aloo beans fry and curry for chapathi and rice healthy dish for pregnant

తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్‌ చేసిన పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలను వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి.

తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!

బంగాళాదుంప ముక్కలు మగ్గిన తర్వాత బీన్స్‌ ముక్కలు వేసి ఉడికించాలి. బీన్స్‌, బంగాళాదుంపలు నూనెలో బాగా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కశ్మీరీ కారం వేసి కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.

టమాటా ముక్కలను చిన్నగా కట్‌ చేసి కూరలో వేసి కలిపి మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత కప్పు నీళ్లు పోసి చిన్న మంటపైన నూనె పైకి తేలేవరకు ఉడికించాలి. టేస్టీ ఆలూ బీన్స్‌ కర్రీ రెడీ.. చపాతీలోకి, అన్నంలోకి అమోఘంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Saturday, September 5, 2026, 12:15 [IST]
Desktop Bottom Promotion