Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ఆంధ్రమాత గోంగూరతో పప్పు.. కమ్మగా,రుచిగా ఎలా చేయాలంటే..
గోంగూర పప్పు అంటే తెలుగువారికి ఒక ప్రత్యేకమైన వంటకం. పుల్లపుల్లగా, కమ్మగా ఉండే ఈ పప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి అద్భుతం. ఇది కేవలం రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల పరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. గోంగూర పప్పును తయారు చేయడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి అన్ని పదార్థాలను కుక్కర్ లో వేసి ఉడికించి పోపు వేయడం. మరొకటి, గోంగూరను విడిగా వేయించి పప్పుతో కలపడం. ఈ రెండు పద్ధతులు రుచిలో కొద్దిగా తేడా ఉన్నప్పటికీ, రెండు రకాల పప్పులు చాలా రుచిగా ఉంటాయి. సంప్రదాయ పద్ధతిలో గోంగూర పప్పు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
గోంగూర పప్పు తయారీకి కావలసిన పదార్థాలు
-గోంగూర: 2 పెద్ద కట్టలు
-కంది పప్పు: 1 కప్పు
-పచ్చిమిర్చి: 8-10
-చిన్న ఉల్లిపాయ: 1
-టొమాటో: 1
-నూనె: 2 టేబుల్ స్పూన్లు
-పసుపు: 1/2 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-కరివేపాకు: 1 రెమ్మ
-ధనియాల పొడి: అర టీస్పూన్
-నూనె/నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
-ఆవాలు: అర టీస్పూన్
-జీలకర్ర: 1 టీస్పూన్
-ఎండుమిర్చి: 2-3
-మినప పప్పు: 1 టీస్పూన్
-శెనగ పప్పు: 1 టీస్పూన్
-ఇంగువ: చిటికెడు
-వెల్లుల్లి రెబ్బలు: 4-5
-కరివేపాకు: కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా కంది పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, అరగంట పాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత కుక్కర్ లో కడిగిన పప్పు, సరిపడా నీళ్లు (సుమారు 2-3 కప్పులు), కొద్దిగా పసుపు వేసి, 3-4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
-ఇప్పుడు గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి, కాడలు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలుగా తరిగి సిద్ధం చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె లేదా కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి, అందులో నూనె వేయాలి. నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారిన తర్వాత, టొమాటో ముక్కలు, గోంగూర ఆకులు వేయాలి. గోంగూర ఆకులు మెత్తగా మగ్గిపోవడానికి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి.
-గోంగూర ఆకులు పూర్తిగా మెత్తబడిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును ఇందులో వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. పప్పు కాస్త గట్టిగా అనిపిస్తే, కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని 5-10 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి.
-ఇప్పుడు పప్పు కోసం పోపు సిద్ధం చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడించాలి. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, మినపపప్పు, శెనగ పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించాలి. చివరిగా కరివేపాకు వేసి వేయించి ఈ పోపును పప్పులో వేసి బాగా కలపాలి. అంతే గోంగూర పప్పు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications