Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఆంధ్రా సమ్మర్ స్పెషల్..పచ్చి మామిడికాయతో పప్పు ఈ పద్ధతిలో చేశారంటే వేళ్లు జుర్రుకొని మరీ తింటారు
ఏపీ,తెలంగాణలో ప్రత్యేకంగా వేసవి కాలంలో ఎక్కువగా తయారు చేసుకునే వంటకం 'మామిడికాయ పప్పు'. మామిడికాయ పులుపు, కందిపప్పు రుచి,మసాలాల సమతుల్యతతో కలగలిపి ఈ పప్పు అద్భుతమైన రుచి ఉంటుంది. ఇది రుచికరమైనది మాత్రమే కాదు..పోషకమైనది. ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచి, జీర్ణ వ్యవస్థకు మేలు చేసే ఆహారంగా నిలుస్తుంది. దీనిని అన్నంతో, నెయ్యితో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. మామిడికాయలు విరివిగా దొరికే ఈ సమయంలో ఈ పప్పును ఇంట్లోనే సులభంగా తయారుచేయడం ఎలాగో ఇక్కడ చూడండి.
మామిడికాయ పప్పు తయారీకి కావలసిన పదార్థాలు
మామిడికాయ: 1
కందిపప్పు: 1 కప్పు
మామిడికాయ: ఒకటి
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి: 2-3
ఆవాలు: ఒక టీస్పూన్
జీలకర్ర: అర టీస్పూన్
ఉల్లిపాయ: ఒకటి
కరివేపాకు: రెండు రెబ్బలు
ఎండుమిర్చి: 2-3
నూనె: రెండు టేబుల్‌స్పూన్లు
పసుపు: అర టీస్పూన్

మామిడికాయ పప్పు తయారీ విధానం
-మామిడికాయ పప్పు తయారుచేయడం కోసం ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి ఇందులో తగినంత నీరు, పసుపు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
-ఇప్పుడు మామిడికాయను చెక్కు తీసి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
-తర్వాత ఉడికిన కందిపప్పును మెత్తగా మెదుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు,ఇంగువ,లవంగాలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో మామిడికాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి.
Jowar kichidi : జొన్న ఖిచిడి..టేస్టీ అండ్ హెల్దీ..ఇలా చేశారంటే అమృతమే
-తర్వాత మెదిపిన కందిపప్పు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
-అవసరమైతే కొద్దిగా నీరు పోసి పప్పును 5-10 నిమిషాలు ఉడికించాలి.
-పప్పు బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే మామిడికాయ పప్పు రెడీ. ఈ పప్పును కుక్కర్ లో కాకుండా నేరుగా గిన్నెలో కూడా చేసుకోవచ్చు.
-కొంతమంది బెల్లం వేసి మామిడికాయ పప్పును తయారుచేస్తారు. ఇది పప్పుకు తియ్యని, పుల్లని రుచిని ఇస్తుంది. కొందరు వెల్లుల్లిని,కొంతమంది ఈ పప్పులో టమాటో కూడా వేస్తారు. దీని వలన పప్పు మరింత రుచిగా తయారవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications