Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తెలుగువాళ్లు తప్పక తినాల్సిన పచ్చడి ఇదే,ఎలా చేయాలంటే
సమ్మర్ సీజన్ ప్రారంభం నుంచే మార్కెట్ లో మామిడికాయలు కనిపిస్తుంటాయి. పచ్చిమామిడికాయతో అనేక రకాల వంటలు చేస్తుంటారు. అయితే మీరెప్పుడైనా ఉల్లి మామిడి పచ్చడి తిన్నారా? ఉల్లి, మామిడికాయ కలయికతో చేసే పచ్చడి తెలుగువారి వంటకాల్లో ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. పుల్లగా,కారంగా ఉండే ఈ పచ్చడిని చేయడం చాలా సులభం, అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉల్లి మామిడి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఉల్లి మామిడి పచ్చడి తయారీకి కావలసిన
పదార్థాలు
జీలకర్ర: 1/2 టీస్పూన్
ఆవాలు: 1/2 టీస్పూన్
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: చిటికెడు
కరివేపాకు: కొద్దిగా
పచ్చి మామిడికాయ ముక్కలు: 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు: 1 కప్పు
పచ్చిమిర్చి: 4-5
వెల్లుల్లి రెబ్బలు: 4-5
నూనె: 2 టేబుల్ స్పూన్లు

ఉల్లి మామిడి పచ్చడి తయారీ విధానం
-ముందుగా పచ్చిమిర్చి, మామిడికాయ, ఉల్లిపాయ,వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేసి వేగాక కరివేపాకు వేయాలి. పచ్చడిని నిల్వ చేసుకోవడానికి, నూనె కొద్దిగా ఎక్కువ వేసి, బాగా వేయించాలి.
-తర్వాత పచ్చిమిర్చి ముక్కలు,వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. మీ రుచికి తగినట్లుగా పచ్చిమిర్చిని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
-ఇఫ్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం మగ్గే వరకు వేయించాలి.
-తర్వాత అందులో పుల్లటి పచ్చి మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
-మామిడికాయ ముక్కలు మెత్తబడే వరకు మూతపెట్టి ఉడికించాలి.
-పచ్చడి చల్లారాక మెత్తగా నూరుకోవాలి లేదా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతే ఉల్లి మామిడి పచ్చడి రెడీ. ఈ పచ్చడిని అన్నం, ఇడ్లీ, దోస, చపాతీ మొదలైన వాటితో తినవచ్చు.
మటన్ ఖైమా పులావ్..అబ్బబ్బా ఏం టేస్ట్ గురూ వాసనే పిచ్చెక్కిస్తది,ఎలా చేసుకోవాలంటే
ఉల్లి మామిడి పచ్చడి ప్రయోజనాలు
మామిడికాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు కూడా జీర్ణక్రియను
మెరుగుపరుస్తాయి. ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో కేలరీలు తక్కువగా
ఉంటాయి, కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మామిడికాయలో కూడా
విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
మామిడికాయలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది,చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మామిడికాయలో ఉండే విటమిన్ కె ఎముకలను బలపరుస్తుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉల్లిపాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications