Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Andhr Style నోరూరించే స్పైసీ చికెన్ ములక్కాడ గ్రేవీ రిసిపి..
Recipes
oi-Saraswathi N
Posted By: Saraswathi N
Chicken with Drumsticks :మాంసాహార ప్రియులకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఆదివారం వస్తే చాలు చికెన్ లేనిదే ముద్ద దిగదు. చాలా మంది చికెన్ (Chicken) తినడానికి ఇష్టపడతారు. చాలా చికెన్ వెరైటీలు ఉన్నాయి.
నోరూరించే స్పైసీ ములక్కాడ చికెన్ కూర.. ఎంత రుచిగా ఉంటుంది. చికెన్ తో ప్రతి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో వివిధ రకాల వంటకాలు బిర్యాని, గ్రేవీ, చికెన్ పులావ్ వంటి వాటినే కాకుండా ఇతర వంటకాలను కూడా తయారుచేస్తూ ఉంటాం. ఈసారి కాస్త వెరైటీగా చికెన్ ను మునక్కాడలతో కలిపి కూర వండుకోండి. ఈ కూర భలే రుచిగా ఉంటుంది. మరి ఈ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం. అలాగే ఈ రిసిపి మీరూ ట్రై చేసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి..
కావలసిన పదార్థాలు:
- అర కేజీ చికెన్
- మూడు మునక్కాడ ముక్కలు
- రెండు ఉల్లిపాయలు
- రెండు టమోటాలు
- ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్
- పావు టీ స్పూన్ పసుపు
- రెండు టేబుల్ స్పూన్ ల కారం
- రెండు రెబ్బలు కరివేపాకుల తరుగు
- సగం స్పూన్ గరం మసాలా
- ఒక స్పూన్ నిమ్మరసం
- కొత్తిమీర తరుగు
- పావు కప్పు నూనె
మసాలా కోసం:
- రెండు టేబుల్ స్పూన్ ల ధనియాలు,
- ఏడు లవంగాలు,
- ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,
- ఐదు యాలకులు,
- ఒక ఇంచు దాల్చిన చెక్క ,
- రెండు టేబుల్ స్పూన్ ల ఎండు కొబ్బరి తరుగు,
- ఒక టేబుల్ స్పూన్ గసగసాలు .
తయారుచేయు విధానం
- మసాలా కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ధనియాలు, లవంగాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, ఎండుకొబ్బరి ఇలా ఒకదాని తరువాత ఒకటి మసాలా దినుసులన్నింటిని (Spices) వేసి మంచి వాసన పోయే వరకు తక్కువ మంట మీద వేపుకోవాలి.
- మసాలా దినుసులన్నీ వేగిన తరువాత చివరిలో ఒక టేబుల్ స్పూన్ గసగసాలను వేసి వేపుకొని తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఈ మసాలా దినుసులు అన్ని చల్లారాక మిక్సీ జార్ లో వేసి కొన్ని నీళ్లు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి.
- నూనె వేడి అయిన తరువాత ఉల్లిపాయల తరుగు, కరివేపాకులు వేసి ఉల్లిపాయలు మెత్తబడి లేత బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయలు బాగా మగ్గిన తరువాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకూ బాగా వేపుకోవాలి
- ఇప్పుడు ఇందులో పసుపు, కారం వేసి కలుపుకొని టమోటో ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి.
- ఒక నిమిషం తరువాత పావు కప్పు నీళ్లు వేసి మూతపెట్టి టమోటాలు బాగా మగ్గి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. టమోటాలు బాగా మగ్గిన తరువాత ఇందులో చికెన్ వేసి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.
- ఐదు నిమిషాల తరువాత మునక్కాడ ముక్కలు, మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాల, ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి బాగా కలుపుకుని మూతపెట్టి ఇరవై నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అయితే మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే కూర అడుగంటకుండా ఉంటుంది.
- చికెన్, మునక్కాడ ముక్కలు బాగా ఉడికిన తరువాత చివరిలో కొత్తిమీర తరుగు, గరం మసాలా, నిమ్మరసం కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చికెన్ మునక్కాడలు కూర రెడీ.
Comments
More From
Boldsky
Prev
Next
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.
[ of 5 - Users]
Read more about: chicken recipe andhra style grevy recipe non vegetarian చికెన్ ఆంధ్ర స్టైల్ గ్రేవీ రిసిపి మాంసాహారం
English summary
Andhra Style Chicken with Drumsticks Recipe in Telugu
Story first published: Saturday, June 3, 2023, 12:34 [IST]
Other articles published on Jun 3, 2023



Click it and Unblock the Notifications












