Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
Andhra Style Gongura Mutton : ఆంధ్రా స్టైల్ గోంగూర మటన్
ఆంధ్రా అనగానే మొదట గుర్తుకు వచ్చేది. రుచికరమైన వంటలు. ఎందుకంటే ఆంధ్రా వంటలు కొంచెం స్పైసీగా ఉంటాయి కనుక. అలాంటి స్పై వంటల్లో గోంగూర మటన్ ఒకటి. ఈ అథెంటిక్ ఆంధ్రా స్టైల్ మటన్ కర్రీని గోంగూర ఆకులతో వండుతారు, ఇది గోంగూర రుచితో కారంగా ఉంటుంది. గోంగూర మటన్ అనేది ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చిన ఒక ప్రామాణికమైన వంటకం. ఇది వివిధ రకాల ఆంధ్రా వంటకాలలో ప్రసిద్ధ మరియు సాంప్రదాయ వంటకాలలో ఒకటి. మటన్ గ్రేవి, మటన్ బిర్యానీ, మటన్ కీమా వంటి వివిధ రకాల వంటకాలు మటన్‌తో చేస్తారు. కానీ ఈ వంటకంలొ గోంగూర ఆకులను ఉపయోగించడం వల్ల దాని ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. గోంగూర మంసం లేకుండా ప్రామాణికమైన ఆంధ్ర మాంసాహార భోజనం అసంపూర్ణంగా ఉంటుంది, ఇది పూర్తిగా రుచికరమైన, నోరూరించే వంటకం.
గోంగూర ఆకులను ఆంగ్లంలో సోరెల్ లీవ్స్ అంటారు. మీరు అన్ని సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌ల మెనులో ఈ నోరూరించే స్పై వంటకాన్ని తప్పనిసరిగా కనుగొంటారు. గోంగూర ఆకుల పులుపు మటన్ కూరకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. మీరు దక్షిణ భారతీయ వంటకాలను రుచి చూడాలంటే, ఇది తప్పనిసరిగా ప్రయత్నించండి. ఇది అన్నం, రోటీ, పులావ్ మరియు బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది.
Recipe By: Boldsky
Recipe Type: ఆంధ్రా స్టైల్ , మెయిన్ కోర్స్
Serves: 4
-
కావలసిన పదార్థాలు
మటన్ మెరినేషన్ కోసం కావలసినవి:
1/2 kg మటన్
పచ్చిమిర్చి, అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్: 2 tbsp
కారం పొడి: 2 tbsp
పసుపు పొడి: 1/4 tbsp
జీలకర్ర-ధనియాల పొడి: 2 tbsp
ఉప్పు: 2 tbsp
నూనె: 4 tbsp
కూర కోసం కావలసినవి:
నూనె: 4 tbsp
జీలకర్ర గింజలు: 1 tbsp
దాల్చిన చెక్క: 2
లవంగాలు: 4
ఏలకులు: 4
మిరియాలు: 4
ఎర్ర మిరపకాయలు: 3
తరిగిన ఉల్లిపాయలు:1 cup
పచ్చిమిర్చి: 5
పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tbsp
గోంగూర ఆకులు: 1 cup
నీరు : 1/2 cup(సరిపడా)
ఉప్పు : రుచికి సరిపడా
-
గోంగూర మటన్ తయారుచేయు విధానం:
సూచనలు
ముందుగా మీరు సిద్దం చేసుకోవడానికి:
ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.
గోంగూర ఆకులను కొమ్మల నుండి విడిపించి నీళ్లతో కడిగి పక్కన పెట్టుకోండి.
పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కలిపి పేస్టులా చేసి పక్కన పెట్టుకోండి.
మటన్ కర్రీ తయారీ:
1. ముందుగా మటన్‌ను శుభ్రం చేసి పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, జీలకర్ర-కొత్తిమీర పొడి, ఉప్పు, నూనె వంటి పదార్థాలను గిన్నెలో వేయాలి.
2. తర్వాత మటన్ పూర్తిగా మసాలాలు బాగా పట్టే విధంగా ముక్కలను కలపండి.
3. అరగంట తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి వేడి చేసి అందులో మటన్‌ని వేయాలి. మూత మూసి మీడియం మంట మీద మటన్ ఉడికించాలి.
4. మటన్ బాగా స్మూత్ గా ఉడికించాలంటే దీన్ని ప్రెజర్ కుక్కర్ లో కూడా ఉడికించుకోవచ్చు. డైరెక్ట్ పాన్ లో అయితే మటన్ మెత్తబడే వరకు ఉడికించాలి. మటన్ ఉడుకుతున్నప్పుడు అవసరమైతే నీరు కలపండి.
ఆంద్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ తయారీ:
1. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి, వేడి చేసి జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, ఎర్ర మిరపకాయలు మరియు తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేసి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
2. ఉల్లిపాయలు మెత్తబడే వరకు వాటిని వేయించి, ఆపై పాన్‌లో పచ్చిమిర్చి, అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ జోడించండి. బాగా మిక్స్ చేస్తూ వేగించండి. పచ్చి వాసన పోయే వరకు పేస్ట్‌ను వేయించాలి.
3. తర్వాత శుభ్రం చేసిన గోంగూర ఆకులను కూడా పాన్ లో వేసి మూత పెట్టి ఉడికించాలి. మధ్యమధ్యలో కలియతిప్పుతూ ఉడికించాలి. గోంగూర ఆకులు బాగా మెత్తబడే వరకు ఉడికించాలి.
4. ఆ తర్వాత ఉడికించిన మటన్‌ను పాన్‌లో వేసి గోంగూర మిశ్రమంతో బాగా కలపాలి. ఇప్పుడు నీరు పోసి ఉప్పు కలపండి. రెండూ బాగా మిక్స్ చేయాలి.
5. తర్వాత మూత మూసి 5 నిమిషాలు ఉడికించి, గ్రేవీ బాగా చిక్కబడే వరకు ఉడికించి, గ్రేవిని ఒకసారి రుచి చూడండి. అవసరమైతే మరింత ఉప్పు వేయండి.
6. అంతే గోంగూర మటన్ రిసిపి రెడీ. దీన్ని వేడి వేడిగా వైట్ రైస్, రోటీ లేదా చపాతీ, పులావ్‌తో సర్వ్ చేయండి.
- People - 4
- Calories - 455 Kcal
- Fat - 36G
- Protein - 14G
- Carbohydrates - 13G
- Sodium - 1.5G
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












