Latest Updates
-
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.!
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో వంటకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రా స్టైల్‌లో చేసే వంటలు, వాటి విధానం, సువాసనలు తలచుకుంటేనే నోరూరిపోతుంటుంది. ఇక సముద్ర తీరం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చేపలు చాలా ఫేమస్. అదేవిధంగా రొయ్యల చెరువులూ అంతే ప్రసిద్ధి చెందాయి. అందుకే అక్కడ చేపలు, రొయ్యల వంటకాలు అంటేనే చెవులు కోసేసుకుంటారు. వాటిలో ఒకటి ఎండు పప్పు రొయ్యలు. వీటిని వంకాయల కాంబినేషన్‌తో చేశారంటే ఆ ఘుమఘుమలు పది ఇళ్లకు పాకాల్సిందే. పప్పు రొయ్యల వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం..

పప్పు రొయ్యల వంకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఎండు పప్పు రొయ్యలు- 300 గ్రాములు- 20 నిమిషాలు
ఉల్లిపాయలు- రెండు
టమాటాలు- నాలుగు
పచ్చిమిర్చి- నాలుగు
కరివేపాకు- రెండు రెబ్బలు
వంకాయలు- పావు కేజీ
కొత్తిమీర- గుప్పెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
గరం మసాలా పొడి- టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
పసుపు- అర టీస్పూన్
కారం- రెండు టీస్పూన్లు
పప్పు రొయ్యలు వంకాయ కర్రీ తయారీ విధానం
ముందుగా ఎండు పప్పు రొయ్యలను శుభ్రంగా రెండు సార్లు కడిగి 20 నిమిషాల పాటు మరుగుతున్న నీళ్లలో ఉడికించుకోవాలి.
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వంకాయలను బొడ్లు తీసి పొడుగ్గా, ఇంచు మందంలో కట్ చేసుకుని ఉప్పు, పసుపు వేసిన నీళ్లలో కడిగి పెట్టుకోవాలి.
స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి.

ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసి మెత్తగా ఉడికేవరకు మగ్గనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. నీళ్లలో నానబెట్టిన వంకాయలు వేసి పది నిమిషాల పాటు చిన్న మంటపైన ఉడకనివ్వాలి.
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.!
వంకాయలు బాగా మగ్గిన తర్వాత ఉడికించిన రొయ్యలను వేసుకుని కలపాలి. ఇప్పుడు అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మరో పది నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత కొన్ని నీళ్లు పోసి మీడియం మంటపైన నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
నూనె పైకి తేలిన తర్వాత చివర్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీ ఇంట్లో ఆదివారం రొయ్యల ఘుమఘుమలతో అదిరిపోతుంది. లంచ్‌లో వేడి వేడి అన్నంలోకి లేదా డిన్నర్‌లోకి చపాతీ, రోటీల్లోకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్..
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
