ఈ టేస్ట్‌ నెవర్‌ బిఫోర్‌.. సండే స్పెషల్‌ పాలకూర చికెన్‌, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.!

సండే వచ్చింది.. ఇంట్లో ఏం స్పెషల్‌ చేయాలా అని ఆలోచిస్తున్నారా.. నాన్‌వెజ్‌ తినే ఏ ఇంట్లో అయినా ఈ థింకింగ్‌ తప్పనిసరి. ఈ ఆదివారం కొత్తగా అందరూ తినే చికెన్‌తో ఈ స్పెషల్‌ రెసిపీని ట్రై చేయండి. నార్మల్‌ చికెన్‌ కర్రీ కంటే అద్భుతంగా బిర్యానీ టేస్ట్‌ కూడా మర్చిపోయేలా ఉంటుంది. అదే పాలకూర చికెన్‌. ఈ ప్రత్యేక వారం మీ కుటుంబీకుల మనసు దోచేలా ఈ రెసిపీని తప్పక ట్రై చేయాల్సిందే..

Sunday special recipe palakura chicken know the ingredients and process

పాలకూర చికెన్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

మ్యారినేట్‌ చేయడం కోసం

చికెన్‌- కేజీ
ఉప్పు- రుచికి సరిపడా
కారం- టేబుల్‌ స్పూన్‌
అల్లం వెల్లుల్లి ముద్ద- టేబుల్‌ స్పూన్‌

పాలకూర పేస్ట్‌ కోసం

పాలకూర- పెద్ద ఒకటి
ఉప్పు- కొద్దిగా
చక్కెర- కొద్దిగా
కొత్తిమీర- గుప్పెడు

పాలకూర చికెన్‌ కర్రీ కోసం

నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు
నూనె- టేబుల్‌ స్పూన్‌
జీలకర్ర- అర టీస్పూన్‌
మసాలా దినుసులు
ఉల్లిపాయలు- ఐదు
పచ్చిమిర్చి- మూడు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- రెండు టేబుల్‌ స్పూన్లు
పసుపు- అరటీస్పూన్‌
కారం- టేబుల్‌ స్పూన్‌
జీలకర్ర పొడి- అర టీస్పూన్‌
టమాటాలు- రెండు
ఉప్పు- రుచికి సరిపడా

తాలింపు కోసం

నెయ్యి- టేబుల్‌ స్పూన్‌
వెల్లుల్లి రెబ్బలు- ఆరు
ఇంగువు- అరటీస్పూన్‌
కారం- అర టీస్పూన్‌

పాలకూర చికెన్‌ తయారీ విధానం

ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్‌, రసం పొడులు.. హోటల్‌ స్టైల్‌ రుచితో ఇంట్లోనే.!

ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్‌లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి గంటపాటు మ్యారినేట్‌ చేసి పెట్టుకోవాలి.

తర్వాత మరిగించిన నీళ్లలో కాస్త ఉప్పు, చక్కెర వేశాక కట్‌ చేసుకున్న పాలకూర, కొత్తిమీర వేసి కాసేపు ఉడికించాలి. తర్వాత చల్లటి నీళ్లలో ఒకసారి తీసి మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని వేడయ్యాక అందులో నెయ్యి, నూనె వేసి కరిగిన తర్వాత జీలకర్ర, కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలి. పొడుగ్గా కట్‌చేసుకున్న ఉల్లిపాయ వేసి కలపాలి. ఉల్లిపాయ రంగు మారుతున్నప్పుడు పొడుగ్గా కట్‌ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు వేసి కలపాలి. కారం, ధనియాల పొడి వేసి కలిపాక చిన్న గ్లాస్‌ వేడినీళ్లు పోసి మరోసారి ఉడికించాలి.

Sunday special recipe palakura chicken know the ingredients and process

ఇప్పుడు చిన్నగా కట్‌ చేసుకున్న టమాటాలు వేసి మగ్గనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపిన తర్వాత మ్యారినేట్‌ చేసి పెట్టుకున్న చికెన్‌ వేసి ఉడికించుకోవాలి. చికెన్‌ ఉడికాక పాలకూర పేస్ట్‌ వేసి కలిపి బాగా ఉడకనివ్వండి.

వినాయక చవితి స్పెషల్‌: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేయండి.!

నీరంతా ఇంకిపోయి నూనె పైకి తేలుతున్నప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకుని ఉడికించుకోండి. స్టవ్‌పైన చిన్న పాన్‌ పెట్టుకుని అందులో నెయ్యి వేసి కట్‌చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇంగుర, కారం వేసి వేగాక కూరలో వేసి కలుపుకోవాలి. ఈ తాలింపుతోనే పాలకూర చికెన్‌కు అసలు రుచి వస్తుంది.

చివర్లో కసూరి మెంతి, చిన్న నిమ్మకాయ ముక్క, కొత్తిమీర చల్లి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోండి. నెవెర్‌ బిఫోర్‌ టేస్ట్‌తో పాలకూర చికెన్‌ రెడీ. వైట్ రేస్, చపాతీ, పూరీల్లోకి ఈ కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Sunday, September 13, 2026, 7:45 [IST]
Desktop Bottom Promotion