Latest Updates
-
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.!
సరికొత్తగా చికెన్ వెల్లుల్లి వేపుడు..తింటుంటే స్వర్గమే నా సామి రంగా..ఎలా చేసుకోవాలంటే
తెలుగువారికి ఇష్టమైన వంటకాల్లో చికెన్ ఫ్రై ఒకటి. ముఖ్యంగా వెల్లుల్లిని జోడించి చేసే వెల్లుల్లి చికెన్ ఫ్రై రుచిలో అమోఘంగా ఉండడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ రెసిపీ సులభంగా ఉండటంతో పాటు, తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. సాధారణమైన చికెన్ ఫ్రైకి భిన్నంగా, వెల్లుల్లి కారం ఘాటు, సువాసనతో కూడిన ఈ వంటకం పార్టీలకు, వీకెండ్ లంచ్ లకు లేదా స్నాక్ గా కూడా అద్భుతంగా ఉంటుంది. కొంచెం కొత్తగా గార్లిక్ చికెన్ వేపుడు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
గార్లిక్ చికెన్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
-చికెన్
-కారం
-ఉప్పు
-పసుపు
-నిమ్మకాయ
-వెల్లుల్లి
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-దాల్చిన చెక్క
-యాలకలు
-లవంగాలు
-ఆయిల్
-నెయ్యి
-జీలకర్ర పొడి
-చికెన్ మసాలా
-ధనియాల పొడి
-కరివేపాకు
-జీడిపప్పు

గార్లిక్ చికెన్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ లో అరకేజీ చికెన్(బోన్ తో)ముక్కలు ను వేసి నీళ్లతో శుభ్రంగా కడగాలి. చికెన్ ముక్కలు మీడియం సైజ్ లో ఉండాలి.
-శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలలో అర టీస్పూన్ పసుపు, ఒకటిన్నర టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ఫ్రెష్ గా దంచుకున్న అల్లంవెల్లుల్లి పేస్ట్, అర బద్ద నిమ్మరసం వేసి ముక్కలకు అన్నీ పట్టేట్లు బాగా చేతులతో కలపాలి. బౌల్ మీద మూతపెట్టి అరగంట పక్కన పెట్టేయండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకలు,3 లవంగాలు వేసి వేయించాలి.
-మసాలా దినుసులు లైట్ గా వేగిన తర్వాత అందులో పొడవుగా,సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి.
-ఉల్లిపాయ ముక్కలు లైట్ గా కలర్ మారిన తర్వాత అందులో పక్కన ఉంచిన చికెన్ ముక్కలను వేసి పెద్ద మంట మీద 4-5 నిమిషాలు వేయించుకోవాలి.
-చికెన్ ముక్కల్లోని నీరు అంతా పూర్తిగా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్న సమయంలో మంటను మీడియంలో ఉంచి మరో 4 నిమిషాలు వేయించుకోవాలి.
-చికెన్ ముక్కల రంగు మారడం ప్రారంభమైన తర్వాత ఇందులో 15 పొట్టు తీయని వెల్లుల్లి రెమ్మలను దంచి లేదా గ్రైండ్ చేసిన మిశ్రమం వేసి చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి.
-వెల్లుల్లి వేగిన తర్వాత తక్కువ మంట మీద మరో 3 నిమిషాలు వేగనివ్వాలి. ఈ సమయంలో అందులో గాట్లు పెట్టిన 4 పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకోవాలి.
-ముక్క ఉడికిన తర్వాత అందులో ఒకటిన్నర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ జీలకర్ర పొడి, 2 టీస్పూన్ల కారం, 2 టీస్పూన్ల చికెన్ మసాలా వేసి తక్కువ మంట మీద బాగా కలుపుతూ వేయించాలి. 1-2 వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో కొన్ని జీడిపప్పులు వేసి లైట్ గా కలర్ మారేదాకా వేయించి ఈ జీడిపప్పులను నెయ్యితో సహా చికెన్ ముక్కల్లో వేసి కలపండి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా అందులో వేసి బాగా కలిసేటట్లు కలుపుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications