Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
'గోబీ ఖీర్' తో బక్రీద్ 2025 ని సెలబ్రేట్ చేయండి..నోట్లో పెట్టుకుంటే అమృతమే..ఎలా చేయాలంటే
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే ఒక ముఖ్యమైన,పవిత్రమైన పండుగ బక్రీద్. దీనిని ఈద్ అల్ అధా(Eid al-Adha)అని కూడా పిలుస్తారు. బక్రీద్ అనే పదం ఒకర్ ఈద్ నుంచి వచ్చింది. ఒకర్ అంటే మూగజీవి..ఈద్ అంటే పండుగ అని అర్థం. దీనిని బలిదానాల పండుగ అని కూడా అంటారు. ఈ ఏడాది జూన్ 7న బక్రీద్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. బక్రీద్ సందర్భంగా ముస్లింల ఇళ్లు వివిధ రకాల వంటకాలతో నిండి ఉంటాయి. షీర్ ఖుర్మా,స్వీట్ వంటి చాలా తీపి వంటకాలు ఉంటాయి. అయితే ఈ ఏడాది బక్రీద్ సందర్భంగా కొంచెం ఢిఫరెంట్ గా, హెల్తీ రెసిపిని ట్రై చేయాలనుకుంటే గోబీ ఖీర్ ట్రై చేయండి.
సంప్రదాయ స్వీట్లకు ప్రత్యామ్నాయం కోరనుకునేటోళ్లకు ఈ గోబీ ఖీర్ ఫర్ఫెక్ట్. సాధారణంగా కొంతమంది గోబీ తినడానికి ఇష్టపడరు..అలాంటోళ్లు కనుక ఒక్కసారి ఈ గోబీ ఖీర్ తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలని అడగడం గ్యారెంటీ. ఈ ప్రత్యేక మైన డెజర్ట్ క్రీమీగా రుచిగా ఉంటుంది. దీనిని తయారుచేయడం కూడా చాలా ఈజీ. 10 మందికి సరిపడా గోబీ ఖీర్ ని మీ ఇంట్లోనే సులభంగా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

గోబీ ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-తరగిన డ్రైఫ్రూట్-5-6 టీస్పూన్లు
-పాలు-2.5 లీటరు
-నెయ్యి-2.5 టేబుల్ స్పూన్లు
-చక్కెర- 1.5 కప్పులు
-యాలకల పొడి-1 టీస్పూన్
-కాలీఫ్లవర్-2
-కుంకుమపువ్వు
టేస్టీ సొరకాయ హల్వా..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే
గోబీ ఖీర్ తయారీ విధానం
-ముందుగా కాలీఫ్లవర్ ని శుభ్రంగా కడి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కలను తురుముకోవాలి.
-తురిమిన కాలీఫ్లవర్ ను వేడి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి 5 నుండి 6 నిమిషాలు నానబెట్టి దాని పచ్చి వాసన పోతుంది. తర్వాత నీటిని తీసివేసి ఏదైనా అదనపు తేమను తొలగించండి.
-స్టవ్ మీద అడుగు మందపాటి పాత్ర పెట్టి అందులో పాలను తక్కువ వేడి మీద మరిగించండి.
-మరో పాన్ లో నెయ్యి వేడి చేసి నీరు పిండేసిన కాలీఫ్లవర్ వేసి బంగారు రంగు వచ్చేవరకు 10-12 నిమిషాలు తక్కువ మంట మీద వేయించాలి.
-పాలు బాగా మరిగి కొద్దిగా చిక్కగా అయిన తర్వాత ఇందులో వేయించిన కాలీఫ్లవర్ వేసి కలుపుతూ 15 నుండి 20 నిమిషాలు తక్కువ వేడి మీద ఉడికించాలి.
-తర్వాత అందులో చక్కెర వేసి పూర్తిగా కరిగించనివ్వండి. తర్వాత ఏలకుల పొడి, తరిగిన బాదం,జీడిపప్పు,పిస్తా వేసి కలిపాక ఇందులోనే కొద్దిగా పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి కలపాలి.
-పాయసాన్ని మరో 7 నుండి 8 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి, అంతే గోబీ ఖీర్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications