Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
బీరకాయ బజ్జీ హెల్తీ ఈవెనింగ్ స్నాక్.. వర్షాకాలంలో ఇమ్యూనిటి బూస్టర్
Birakay Bajji Recipe ప్రస్తుతం వర్షాకాలం ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి. ఇంట్లోని బయటకు కాలు కదపనివ్వుకుండా వర్షాలు పడేటప్పుడు కాఫీతో పాటు నోటికి కమ్మగా రుచిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగని రోజూ బజ్జీ బోండాలు రోడ్ సైడ్ కొనుక్కోని తినలేం కదా. అలా తిన్నా అవి ఆరోగ్యానికి హానికరం. అదే మనం ఇంట్లోనే ఏదైన కూరగాయలతో బబ్జీలు తయారుచేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు మీ నోటికి ఒక డిఫరెంట్ టేస్ట్ ను పరిచయం చేసినట్లు ఉంటుంది. అందుకోసమని ఈ రోజు మీకోసం ఈ వర్షాకాలంలో మార్కెట్లో విరివిగా లభించే బీరకాయతో బజ్జీ ఈవెనింగ్ స్నాక్ ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలియజేస్తున్నాం.
బీరకాయ బజ్జీలు సౌంత్ ఇండియన్ స్నాక్ రిసిపి . ఈ బజ్జీని తయారు చేయడం చాలా సులభం, అయితే ఇది వేయించడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. బీరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. బీరకాయను ఏరకంగా తీసుకున్నా అది మన శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇందులో అధిక ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడం లో మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో తనదైన పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం మరియు జుట్టును ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న బీరకాయను రెగ్యులర్ ఆహారంలో చేర్చుకోకుండా ఎలా ఉండగలం చెప్పండి. మరి ఈ బీరకాయతో ఈవెనింగ్ స్నాక్ బజ్జీ ఎలా తయారుచేయాలో చూదాం.

కావాల్సిన పదార్థాలు:
• శనగ పిండి - 1 కప్పు
• బియ్యం పిండి - 1 టేబుల్ స్పూన్
• కారం పొడి 1 టీస్పూన్
• లేత బీరకాయ - 1 (మీకు కావాల్సిన సైజులో గుండ్రంగా లేదా
పొడవుగా కట్ చేసుకోవచ్చు).
• పచ్చి మిరపకాయలు -3 (సన్నగా తరిగినవి)
• వామ్ - 1/4 టీ స్పూన్.
• వంట సోడా - 1 చిటికెడు.
• కరివేపాకు- రెండు రెమ్మలు (సన్నగా తరిగినవి)
• నీరు - పిండి కలుపుకోవడానికి సరిపడా.
• నూనె - వేయించడానికి.
• చాట్ మసాలా - 1/2 టీ స్పూన్.
• ఉప్పు - రుచికి.

తయారుచేయు విధానం:
1.ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో అందులో శెనగపిండి, బియ్యప్పిండి,
సన్నగా తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి, వామ్ , కారంపొడి, వంటసోడా,
ఉప్పు, నీళ్లు పోసి బజ్జీల పిండిలా చక్కగా కలపాలి.
2. తర్వాత తొక్కను తీసి , శుభ్రంగా కడిగి గుండ్రంగా లేదా పొడవుగా మీకు
నచ్చిన ఆకారంలో బీరకాయను కట్ చేసుకోవాలి.
3. ఫైయింగ్ పాన్ లో నూనె పోసి నూనె వేడయ్యాక, బీరకాయ ముక్కలను పిండిలో
ముంచి వేడి నూనెలో వేయాలి.
4. మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి.
5. ఇలా వేడి వేడిగా తయారుచేసుకున్న బజ్జీలను సర్వింగ్ ప్లేట్ లో
మార్చుకుని వాటి మీద చాట్ మసాలా చిలకరించి వేడిగా సర్వ్ చేయండి.
6. అలాగే ఈ బీరకాయ బజ్జీలను కెచప్ లేదా మీకు ఇష్టమైన చట్నీతో కూడా
తినొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఈవెనింగ్ స్నాన ట్రై చేసి , రుచి చూసి మీ అభిప్రాయన్ని మాతో పంచుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications