Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
పల్లీలు,కొబ్బరి లేకుండా ఇడ్లీలోకి స్పెషల్ చట్నీ..డజను ఇడ్లీ తినడం గ్యారెంటీ..ఎలా చేసుకోవాలంటే
ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాలకు చట్నీ లేనిదే పూర్తి అవ్వదు. సాధారణంగా మనం ఇడ్లీలు చేసుకుంటే అందులోకి పల్నీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ తయారుచేసుకుంటాం. మరికొందరు అయితే షేర్వా కూడా తయారుచేస్తుంటారు..తెలంగాణలో అయితే ఇడ్లీలోకి మటన్ కూడా కాంబినేషన్ గా తీసుకుంటారు. అయితే ఇడ్లీలోకి ఎన్నో రకాల చట్నీలు ఉన్నప్పటికీ, ఉల్లిపాయ-టొమాటో చట్నీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీని పులుపు, కారం, తీపి సమ్మేళనం రుచిని అద్భుతంగా పెంచుతుంది. ఇది తయారు చేయడం సులభం, పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇడ్లీలోకి స్పెషల్ ఉల్లిపాయ టమాటో చట్నీ ఎలా తయారుచేయాలో ఇక్కడ చూడండి.
ఆనియన్ టమాటో చట్నీ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-ఆయిల్
-కరివేపాకు
-ఉల్లిపాయ
-టమాటో
-శెనగపప్పు
-పోపు దినుసులు
-ఎండుమిరపకాయలు
-వెల్లుల్లి
-అల్లం
-చింతపండు
-ఉప్పు
-పసుపు
-జీలకర్ర

ఆనియన్ టమాటో చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత మీ కారానికి తగినట్లు 8-10 ఎండుమిరపకాయలు వేసి వేయించి ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత అదే కడాయిలో మిగిలి ఉన్న నూనెలో రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేయండి. ఉల్లిపాయలు 50 శాతం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
-ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత అందులో 3 పండిన టమాటోల ముక్కలు, పావు స్పూన్ పసుపు, చిన్న అల్లం ముక్క వేసి ఒకసారి కలిపి మూతపెట్టి టమాటోలు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూతతీసి కలుపుతూ ఉండాలి. అందులో కొంచెం చింతపండు వేసి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో వేసి చింతపండు, వేయించిన ఎండుమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ జీలకర్ర, 4 స్పూన్ల పుట్నాల శెనగపప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత ఫ్నైచేసుకున్న ఉల్లిపాయ,టమాటో కూడా మిక్సీ గిన్నెలో ఉన్న పొడిలో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి ఓ బౌల్ లోకి తీసుకోండి. కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోండి. చట్నీ కొంచెం లూస్ గా ఉంటేనే బాగుంటుంది.
-తర్వాత స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో అర టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి,చివర్లో ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి.
-ఇప్పుడు ఈ తాళింపు మొత్తాన్ని చట్నీలో వేసి కలుపుకోండి. అంతే ఇడ్లీలోకి రుచికరంగా ఉండే ఆనియన్ టమాటో చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
