Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.!
పిల్లల్లో బ్రెయిన్ షార్ప్‌నెస్ కోసం బెండకాయలను తల్లి ఇష్టంగా వండిపెడుతుంది. కానీ బెండకాయను ఎన్ని రకాలుగా వండినా చాలా సార్లు జిగురుగానే ఉంటుంది. దీంతో పిల్లలు తినడానికి మారాం చేయడమే కాదు. ఒక్కోసారి పెద్దలు కూడా అయిష్టంగానే తింటారు. కానీ ఈ పద్ధతిలో ట్రై చేశారంటే ఇక జిగురు అనే మాటే లేకుండా.. నోటికి కమ్మగా ఉంటుంది.

బెండకాయలో విటమిన్లు సి, కె, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో బరువు తగ్గడానికి దోహదపడుతుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు జీర్ణక్రియకు మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
బెండకాయలోని పెక్టిన్ అనే ఫైబర్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గర్భిణీలకు, శిశువు మెదడు, వెన్నెముక అభివృద్ధికి దోహదపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచి మొటిమలను తగ్గిస్తుంది. బెండకాయలను కడిగి కట్ చేసి రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపు తాగడం ద్వారా ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.
బెండకాయ పచ్చిమిర్చి పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు
బెండకాయలు- పావు కేజీ
పెరుగు- 200గ్రా
పచ్చిమిర్చి- 10 లేదా 12(మీరు తినే కారానికి సరిపడా)
ఉల్లిపాయ- ఒకటి
అల్లం- చిన్న ముక్క
వెల్లుల్లి- 6 రెబ్బలు
నూనె- 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర- టీస్పూన్
ఆవాలు- టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
గరం మసాలా- అర టీస్పూన్
కొత్తిమీర- కొద్దిగా
బెండకాయ పచ్చిమిర్చి పులుసు తయారీ విధానం
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత వాటిని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.!
ఇప్పుడు మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత స్టవ్‌పైన పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక బెండకాయ ముక్కలను వేసి వేయించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. కాసపయ్యాక కొద్దిగా ఉప్పు వేసి కలియతిప్పాలి. జిగురు పోయేవరకు ఇలా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేవరకు వేయించాలి.

తర్వాత ఇందులో పెరుగు వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి. చిక్కగా ఉడికిన తర్వాత అందులో బెండకాయ ముక్కలు వేసుకోవాలి. కాసేపు వేగిన తర్వాత రుచికి సరిపడా మరికొంచెం ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత కాసిన్ని నీళ్లు పోసి మీడియం మంటమీద ఉడికించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత చివరిగా ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకొని దించుకోవాలి.
ఇలా చేయడం ద్వారా కూర జిగురు లేకుండా ఉంటుంది. చపాతీలోకి, వేడి వేడి అన్నంలోకి అదిరిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లకి, ఆఫీసు బాక్స్‌లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications