Latest Updates
-
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా?
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా..
సాధారణంగా చాలామంది రాత్రి సమయంలో ఏదైనా తీయగా, స్వీట్ తినాలని అనిపిస్తుంటది. ఆ సమయంలో బయటకు వెళ్లి తెచ్చుకోవడం కష్టం, అలాగని ఆ కోరికను చంపుకోలేం. ఇలాంటి సమయాల్లో మీ మనసుకు, కడుపుకు తృప్తినిచ్చే బెస్ట్ ఆప్షన్ బనానా బ్రెడ్. బేకరీలో దొరికే మృదువైన, కమ్మటి బనానా బ్రెడ్ ను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిలో ఉన్న అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని తయారు చేయడానికి మీకు ఓవెన్ అస్సలు అవసరం లేదు.మన వంటగదిలో ఉండే సాధారణ పాన్ తోనే బేకరీ స్టైల్ బ్రెడ్ ను తయారుచేసుకోవచ్చు.

నోట్లో వేస్తే కరిగిపోయే బేకరీ స్టైల్ బాదుషా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా చేయండి!
బనానా బ్రెడ్ తయారీకి కావలసిన పదార్థాలు
బాగా పండిన అరటిపండ్లు - 5
చక్కెర - 180 గ్రాములు
పెరుగు - 180 గ్రాములు
కరిగించిన వెన్న - 60 గ్రాములు
వెనిలా ఎక్స్ట్రాక్ట్ - 2 టీస్పూన్లు
మైదా పిండి - 180 గ్రాములు
బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్
బేకింగ్ సోడా - అర టీస్పూన్
దాల్చినచెక్క పొడి (సినమన్ పౌడర్) - 1 టేబుల్ స్పూన్
వాల్నట్స్ - గుప్పెడు
బటర్ పేపర్ - 1 షీట్

బనానా బ్రెడ్ తయారీ విధానం
-ముందుగా 5 బాగా పండిన అరటిపండ్లను తీసుకుని తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసి ఒక మిక్సీ జార్ లో వేయండి. ఇందులోనే చక్కెర, పెరుగు, వెన్న, వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేయండి. ఈ మిశ్రమాన్ని ఎక్కడా ముక్కలు లేకుండా క్రీమ్ లాగా, మెత్తని పేస్ట్ లా బ్లెండ్ చేసుకోండి. ఈ పేస్ట్ను ఒక పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో జల్లెడ ఉంచి మైదా పిండిని వేయండి.
-ఇప్పుడు జల్లించిన పిండిలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపండి. తర్వాత సన్నగా తరిగిన వాల్ నట్ ముక్కలను వేసి పిండిలో కలిసేలా తిప్పండి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అరటిపండు పేస్ట్ ను ఈ పొడి పిండి మిశ్రమంలో వేసి అన్నీ ఒకదానితో ఒకటి బాగా కలిసేలా మృదువుగా గిలకొట్టండి. ఇప్పుడు ఒక బ్రెడ్ మౌల్డ్ (కేక్ పాన్) తీసుకుని, అడుగున బటర్ పేపర్ పరిచి ఈ బ్యాటర్ ను అందులోకి మార్చుకోండి. అందంగా కనిపించడానికి పైన కొన్ని వాల్ నట్ ముక్కలు, అరటిపండు స్లైసెస్ తో అలంకరించండి.
-గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ లేదా కడాయి ఉంచండి. దాని అడుగు భాగంలో మందంగా ఉప్పు పోయండి. ఇది వేడిని సమానంగా పంచడానికి సహాయపడుతుంది. మంటను హై ఫ్లేమ్ లో పెట్టి 15 నిమిషాల పాటు పాన్ ను వేడి చేయండి.
-పాన్ బాగా వేడెక్కిన తర్వాత, మంటను మీడియంకు తగ్గించండి. ఉప్పు పైన ఒక చిన్న స్టాండ్ లేదా ప్లేట్ పెట్టి, దాని మీద మన బ్రెడ్ మౌల్డ్ ను జాగ్రత్తగా ఉంచండి. పాన్ కు గాలి బయటకు పోకుండా గట్టిగా మూత పెట్టేయండి. ఇలా మీడియం మంట మీద సుమారు ఒక గంట పాటు బేక్ అవ్వనివ్వండి.
-గంట తర్వాత మూత తీసి చూడండి. ఒక టూత్ పిక్ తో బ్రెడ్ మధ్యలో గుచ్చి చూడండి, దానికి పిండి అంటకుండా శుభ్రంగా బయటకు వస్తే మీ బనానా బ్రెడ్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్లే. స్టవ్ ఆపేసి, మౌల్డ్ను బయటకు తీసి కాసేపు చల్లారనివ్వండి. ఆ తర్వాత బ్రెడ్ను మౌల్డ్ నుండి తీసి, మధ్యలోకి కోసి ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
