గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా?

Posted By:

ప్రస్తుతం చాలామంది జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడు తగినంత ఎక్సర్ సైజ్ లేకపోవడం వల్ల చాలామందికి ప్రధాన సమస్యలు గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి. అలాంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి బయటపడేందుకు మన వంటగదిలో ఉండే దినుసులే అద్భుతంగా పనిచేస్తాయి. అందులో ముఖ్యమైనది వాము.

Bloated After Junk Food Try Instant Relief Ajwain Paratha Recipe in Telugu Goodbye to Gas Acidity

వామును నేరుగా తినలేని వారు, ఎంతో రుచికరమైన వాము పరాఠా చేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తాయి. ఇది గ్యాస్ నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఎన్నో అద్భుత ప్రయోజనాలున్న వాము పరాఠాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా..

వాము పరాఠా తయారీకి కావలసిన పదార్థాలు

గోధుమ పిండి - 2 కప్పులు
వాము - 1 నుంచి 1.5 టీస్పూన్ల వరకు
నెయ్యి లేదా నూనె - పరాఠాలు కాల్చడానికి
ఉప్పు - మీ రుచికి సరిపడా
కొత్తిమీర ఆకులు - సన్నగా తరిగిన
నీరు - పిండిని కలపడానికి తగినంత

వాము పరాఠా తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండిని జల్లించి వేసుకోవాలి. ఇప్పుడు వామును తీసుకుని మీ రెండు అరచేతుల మధ్య ఉంచి తేలికగా నలపాలి. ఇలా చేయడం వల్ల వాములోని సువాసన, ఔషధ గుణాలు పిండికి బాగా పడతాయి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక చెంచా కరిగించిన నెయ్యి వేసి అన్నీ కలిసేలా పిండిని బాగా కలుపుకోవాలి.

-ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా నీరు పోస్తూ, ఎక్కడా ముద్దలు లేకుండా మృదువైన పిండిలా కలుపుకోవాలి. పరాఠాలు చాలా మెత్తగా, సులభంగా వంగేలా రావాలంటే, కలిపిన పిండిపై ఒక మూతను ఉంచి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

-పక్కన పెట్టిన పిండిని తీసుకుని మీడియం సైజ్ లో ఉండే చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని పొడి పిండి చల్లుతూ చపాతీ కర్రతో గుండ్రంగా ఒత్తుకోవాలి. పరాఠా మరింత మృదువుగా, పొరలు పొరలుగా రావాలంటే, గుండ్రంగా ఒత్తిన చపాతీపై కాస్త నెయ్యి రాసి, చిటికెడు కారం చల్లుకోవాలి. ఆ తర్వాత దానిని ట్రయాంగిల్ లేదా గుండ్రంగా మడతపెట్టి, మళ్లీ పరాఠాలా ఒత్తుకోవాలి.

-స్టవ్ మీద పెనం పెట్టి మీడియం మంటపై వేడి చేయండి. పెనం వేడెక్కాక ఒత్తి పెట్టుకున్న పరాఠాను దానిపై వేయండి. ఒక వైపు కాస్త రంగు మారాక, రెండో వైపుకు తిప్పాలి. రెండు వైపులా కొద్దిగా నెయ్యి లేదా నూనె రాస్తూ, పరాఠా మంచి బంగారు రంగులోకి వచ్చి కరకరలాడేంత వరకు గరిటెతో తేలికగా ఒత్తుతూ కాల్చుకోవాలి. అంతే వేడి వేడి వాము పరాఠా రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, July 22, 2026, 11:52 [IST]
Desktop Bottom Promotion