Latest Updates
-
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా?
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే..
ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మన పొట్టకు మేలు చేసే (గట్ హెల్త్) ఆహారం తినడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు. మనకు ఎంతో ఇష్టమైన పెరుగన్నం రుచికి ఏమాత్రం తీసిపోకుండా, అంతకుమించి ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన వంటకం కర్డ్ క్వినోవా మిల్లెట్.
పెరుగులోని ప్రోబయోటిక్స్, క్వినోవాలోని ప్రొటీన్, చిరుధాన్యాల (మిల్లెట్స్)లోని ఫైబర్ కలిసి ఈ వంటకాన్ని ఒక బ్యాలెన్స్డ్ మీల్ గా మారుస్తాయి. మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకైనా, రాత్రి డిన్నర్ కైనా ఇది బెస్ట్ ఆప్షన్. ఈ రుచికరమైన వంటకాన్ని సులభంగా ఎలా తయారు చేయాలో చూడండి.

కావాల్సిన పదార్థాలు
ఉడికించిన క్వినోవా, మిల్లెట్స్ - 1 చిన్న గిన్నె
పెరుగు - 1 చిన్న గిన్నె
వేయించిన పుట్నాలు- పావు గిన్నె
కీరదోస తురుము - సగం
క్యారెట్ తురుము - సగం
ఉప్పు - మీ రుచికి సరిపడా
జీలకర్ర పొడి - పావు టీస్పూన్
చాట్ మసాలా - పావు టీస్పూన్
పల్లీలు- గుప్పెడు
తాలింపు కోసం:
నెయ్యి - 2 టీస్పూన్లు
పచ్చి శనగపప్పు, మినపపప్పు - 2 టీస్పూన్లు
ఆవాలు - పావు టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 1
కరివేపాకు - కొద్దిగా
నువ్వులు - అర టీస్పూన్
వివిధ రకాల గింజలు (మిక్స్డ్ సీడ్స్) - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే..
తయారీ విధానం
-ముందుగా అర కప్పు క్వినోవా, మిల్లెట్స్ తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటిని కనీసం ఒక గంట పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ప్రెజర్ కుక్కర్ లో వేసి, తక్కువ మంటపై 3 విజిల్స్ వచ్చే వరకు లేదా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
-ఉడికిన క్వినోవా, మిల్లెట్స్ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇప్పుడు అందులో పెరుగు, పుట్నాలు, కీరదోస తురుము, క్యారెట్ తురుము, పల్లీలు వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు వంటకానికి అసలైన రుచినిచ్చే తాలింపు చేసుకోడానికి.. స్టవ్ మీద పాన్ పెట్టి రెండు టీస్పూన్ల నెయ్యి వేడి చేయాలి. నెయ్యి కరిగాక శనగపప్పు, మినపపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, నువ్వులు, మిక్స్డ్ సీడ్స్, చిటికెడు ఇంగువ వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి.
-వేగిన తాలింపును ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగు, క్వినోవా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్డ్ క్వినోవా మిల్లెట్ రెడీ. క్యారెట్, కీరదోస వల్ల విటమిన్లు అందుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
