గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

భారతీయ సంప్రదాయంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో గుడికి వెళ్లినప్పుడు అక్కడ లభించే దద్దోజనానికి ఉండే ప్రత్యేకత వేరు. ఎంతటి విందు భోజనం చేసినా, గుడిలో దేవుడికి సమర్పించే ఆ ప్రసాద రూపంలోని దద్దోజనం తింటే కలిగే తృప్తి మాటల్లో చెప్పలేనిది.

సాధారణంగా ఇళ్లలో చేసుకునే పెరుగు అన్నానికి, గుళ్లలో లభించే దద్దోజనానికి ఆ ప్రత్యేకమైన రుచి, సువాసన రావడానికి కొన్ని చిన్న చిట్కాలు, పద్ధతులు ఉంటాయి. రోజంతా పులవకుండా, కమ్మగా, తియ్యగా ఉండే ఈ దద్దోజనాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Temple Style Daddojanam Recipe in Telugu How to Make Authentic Temple Prasadam Curd Rice at Home

దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు

-వండిన అన్నం
-పెరుగు
-ఉప్పు
-నెయ్యి
-ఆవాలు
-జీలకర్ర
-మిరియాలు
-పచ్చిశెనగపప్పు
-పచ్చిమిరపకాయ
-అల్లం
-కరివేపాకు
-ఇంగువ

ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్!

దద్దోజనం తయారీ విధానం

-ముందుగా కుక్కర్ లో అరకప్పు బియ్యం, 1 కప్పు నీళ్లు పోపి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి.

-వండిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. వేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని గరిటతో లైట్ గా మ్యాష్ చేసుకోవాలి(చిదుముకున్నట్లు). పక్కన పెట్టి చల్లారనివ్వండి

-తర్వాత తాలింపు కోసం.. స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక అందులో పావు టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర, 20 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసి వేయించాలి. తర్వాత ఇందులోనే 1 పచ్చిమిరపకాయ చీలికలు, అర ఇంచు అల్లం ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసి అల్లం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. చివరగా అందులో ఇంగువ వేసి స్టవ్ ఆపేయండి. ఈ తాలింపు మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి

-తర్వాత పక్కన ఉంచుకున్న అన్నంలో 1 కప్పు ప్రెష్ పెరుగు వేసుకోండి. అన్నంలో గడ్డులు లేకుండా పెరుగుతో బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే చల్లారిన తాలింపు వేసి కలుపుకోండి. ఇందులోనే పావు టీస్పూన్ ఉప్పు వేసి కలుపుకోండి.

-అంతే దద్దోజనం రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, October 14, 2026, 7:51 [IST]
Desktop Bottom Promotion