Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
గ్రేవీతో క్రీమీగా,పచ్చిమిర్చి ఘాటుతో సొరకాయ పాలు కూర..అన్నం,చపాతీలోకి కేక..ఎలా చేయాలంటే..
ప్రకృతి ప్రసాదించిన అమృతాల్లో సొరకాయ ఒకటి. దీంతో బోలెడు వెరైటీ వంటకాలను తయారుచేయవచ్చు. సొరకాయతో ఫ్రై, పులసు, గారెలు, పాయసం ఇలా బోలెడు రెసిపిలు చేసుకోవచ్చు. అయితే సొరకాయ పాలు కూర మీరెప్పుడైనా టేస్ట్ చేశారా? ఇది సొరకాయ, పచ్చిమిర్చి, పాలు, కొన్ని సాధారణ మసాలాలతో తయారుచేయబడుతుంది. ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అన్నం, చపాతీల్లోకి సొరకాయ పాలు కూర అదిరిపోతుంది. సొరకాయ పాలు కూర మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
సొరకాయ పచ్చికారం పాలు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు
-లేత సొరకాయ
-పోపు దినుసులు
-కరివేపాకు
-కొత్తిమీర
-పచ్చి మిరపకాయలు
-జీలకర్ర
-వెల్లుల్లి
-ఉప్పు
-పసుపు
-ఉల్లిపాయ
-పాలు

సొరకాయ పచ్చికారం పాలు కూర తయారీ విధానం
-లేతగా ఉన్న సొరకాయను(400 గ్రాములు) తీసుకొని దానిమీద చెక్కును తీసి చిన్న చిన్న మెక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీ బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి ఆవాలు చిటపటలాడేదాకా వేయించుకోవాలి.
-తర్వాత అందులో 2 ఉల్లిపాయల సన్నని తరుగు వేయండి. ఇందులోనే అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేదాకా వేయిస్తే సరిపోతుంది.
-తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించాక కట్ చేసిన సొరకాయ ముక్కలు వేసి మొత్తం బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోండి. మూతపెట్టి చిన్న మంట మీద ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
-సొరకాయ ముక్కలు ఉడికేలోగా పచ్చికారం రెడీ చేసుకోండి. ఇందులో మిక్సీ జార్ లో 10 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా, 1 టీస్పూన్ జీలకర్ర,6 వెల్లుల్లి రెమ్మలు వేసి కచ్చాపచ్చాగా వచ్చేట్లు గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో మెత్తగా మగ్గిన సొరకాయ ముక్కల్లో గ్రైండ్ చేసిన పచ్చికారం మొత్తం వేసి తక్కువమంట మీద కలుపుతూ బాగా వేయించాలి. రుచి చూసి కావాలనుకుంటే ఈ దశలోనే ఉప్పు అడ్జెస్ట్ చేసుకోండి.
-తర్వాత అందులో 1టిన్నర కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలు పోసి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడకనివ్వాలి. పాలు మొత్తం ఇంకిపోయి చిక్కటి ముద్దకూరలా అయ్యేదాకా ఉడికించుకోవాలి.
-కావాలనుకుంటే కొంచెం కొత్తీమర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. టేస్టీ సొరకాయ పచ్చికారం పాల కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications