Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
సండే స్పెషల్.. చికెన్ కర్రీని ఇలా చేసుకోండి, జన్మలో మర్చిపోలేని రుచి, కంచం మొత్తం నాకేస్తారు!
ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులకు చికెన్ ఉండాల్సిందే. ఆరోజున ముక్క లేకపోతే గొంతులోకి ముద్ద కూడా దిగదు. అలాంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఆదివారమనే కాదు ఈరోజు చేసినా చికెన్‌తో చేసే వంటలన్నీ అద్భుతంగా ఉంటాయి. అద్భుతమైన రుచిని అందిస్తాయి. అయితే కొంతమందికి ప్రతిరోజూ ఒకే రకమైన చికెన్ కూర తిని తిని బోర్ కొట్టి ఉంటుంది. అందుకే ఈసారి కొత్తగా ప్రత్యేకంగా క్యాప్సికంతో చికెన్ కర్రీ చేసుకోండి. అది అద్భుతమైన రుచితో ఉంటుంది. నోట్లో ఒక్క ముక్క వేసుకోగానే రుచి నాలుకపై నాట్యమాడుతుంది. దీనిని చేసుకోవడం కూడా చాలా సులభం. కాకపోతే కొంత జాగ్రత్త అవసరం. అందుకే ఈ స్టోరీలో ఈ క్యాప్సికం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది తెలుసుకుందాం రండి.

క్యాప్సికం చికెన్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు:
వేరుశెనగ నూనె - 1 కప్పు
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - ½ కప్పు
ఉల్లిపాయలు - 5 (మధ్యస్థ పరిమాణం, పేస్ట్ చేసుకోవాలి)
జీలకర్ర పొడి - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర పేస్ట్ - ½ కప్పు
ఎర్ర మిరపకాయల పేస్ట్ - 4 టేబుల్ స్పూన్లు
పసుపు - ½ టేబుల్ స్పూన్
కారం - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
నీరు - 4 గ్లాసులు (అవసరానికి అనుగుణంగా)
పెరుగు - 1 కప్పు
పచ్చిమిరపకాయలు - 4
టమాటాలు - 2 (ముక్కలుగా కోసినవి)
చికెన్ - 1.5 కిలోలు
క్యాప్సికమ్ - 4 (పెద్దవి, ముక్కలుగా కోసినవి)
ఉప్పు - తగినంత
కొత్తిమీర - 1 కప్పు
పల్లి చట్నీ కాదు, ఈసారి టమాటో పల్లి చట్నీ ట్రై చేయండి.. రుచి సూపర్, ఎలా చేసుకోవాలంటే?
క్యాప్సికం చికెన్ కర్రీ తయారీ విధానం:
ఒక పెద్ద కడాయిలో నూనె వేడి చేసి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు వేయించండి.
ఇప్పుడు ఉల్లిపాయల పేస్ట్ వేసి బాగా బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
ఆపై జీలకర్ర పొడి, కొత్తిమీర పేస్ట్, ఎర్ర మిరప పేస్ట్, పసుపు, కారం వేసి మిశ్రమం నుంచి నూనె విడిపోతూ వచ్చే వరకు వండి.
ఇప్పుడు నెయ్యి జతచేయండి - ఇది కర్రీకి అదనపు రుచిని ఇస్తుంది.
నీరు (సుమారు 2 గ్లాసులు) పోసి మూతపెట్టి 8 నిమిషాల పాటు మరిగించండి.
మూత తీసి పెరుగు వేసి బాగా కలపండి.
ఇక మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిరపకాయలతో పేస్ట్ చేసి కర్రీలో కలపండి.
అందులో చికెన్ ముక్కలు వేసి మధ్యస్థ మంటపై ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి కలిపి మూత పెట్టండి.
చికెన్ కొంత మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసి, మళ్లీ నీరు (2 గ్లాసులు లేదా అవసరానికి అనుగుణంగా) పోసి మరి కొద్దిసేపు ఉడకనివ్వండి.
చివరగా క్యాప్సికమ్ ముక్కలు జత చేసి 5 నిమిషాలు వండి, కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ టేస్టీ కర్రీను బాస్మతి రైస్, జీరా రైస్ లేదా చపాతీతో సర్వ్ చేస్తే ఓ ఫైవ్ స్టార్ ఫీలే వస్తుంది. పక్కన కొంచెం ఉల్లిపాయ సలాడ్, నిమ్మరసం చిందించి తింటే అబ్బా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications