Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Carrot rice recipe: ఒక్కసారి క్యారెట్ రైస్ చేసి తినండి.. జీవితంలో మళ్ళీ మరిచిపోలేరు.. ఎలా చేసుకోవాలంటే!
పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు వారికోసం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను చేసి తినిపిస్తూ ఉంటాము. మనం కూడా ఆరోగ్యకరమైన జీవితం కోసం మంచి ఆహారాన్ని తీసుకుంటాము. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటి క్యారెట్ రైస్. ఈ క్యారెట్ అద్భుతమైన రుచితో ఉండడంతో పాటు.. పుష్కలంగా పోషకాలను కలిగి ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్‌లో ఈ ఆహారాన్ని పెట్టడం వల్ల.. వారికి ఒక మంచి పోషక ఆహరం అందించిన వారు అవుతారు.
క్యారెట్‌లో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిచూపు మెరుగ్గా కనిపించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతోపాటు శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ క్యారెట్ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
క్యారెట్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు..

- తరిగిన ఒక క్యారెట్
- ఒక కప్పు బాస్మతి రైస్
- అర టేబుల్ స్పూన్ కారం
- అర టీస్పూన్ కసూరి మేతి
- ఇంచుమింతులు అర టీస్పూన్
- పావు టీస్పూన్ జీలకర్ర
- రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు
- సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ
- సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర
- రెండు టేబుల్ స్పూన్ల నూనె
- రుచికి తగినంత ఉప్పు
క్యారెట్ రైస్ తయారీ విధానం..
- ఈ క్యారెట్ రెసిపీని తయారు చేయడానికి ముందుగా మనం తీసుకున్న ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగాకడుక్కోవాలి. అనంతరం ఆ బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా ఉడికించుకోవాలి. బియ్యం మృదువుగా ఉడికిన తరువాత.. ఆ బియ్యం నుంచి నీటిని వడగట్టి, అందులోని అన్నంను పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెను పోసుకొని, నూనె వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని, కడాయిపై మూత పెట్టి ఉల్లిపాయలు లేత బంగారు వర్ణంలోకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలు బంగారు వర్ణంలోకి వచ్చిన తరువాత అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. అనంతరం క్యారెట్ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి.
- క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు బాగా వేగినాక.. అందులో రుచికి సరిపడా కారం, కసూరి మేతి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని.. ఆ మసాలాలు అంతా అందులోని ముక్కలకు బాగా పట్టుకునే విధంగా కలుపుకోవాలి.
- అనంతరం మనం ముందుగా వండుకొని పక్కన పెట్టుకున్న అన్నంను.. ఆ క్యారెట్ మిశ్రమంలో వేసుకొని, అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అనంతరం ఆ అన్నంపై కొత్తిమీర చల్లుకొని, ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఆరోగ్యకరమైన వేడి వేడి క్యారెట్ రైస్ సిద్ధమైనట్లే. దీనిని పిల్లలతో పాటు పెద్దలు కూడా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కొన్ని టిప్స్..
- బాస్మతి బియ్యంతోనే ఈ రైస్ తయారు చేసుకుంటే మంచి రుచి వస్తుంది. అలాగే బిర్యానీ తిన్న అనుభూతి కలుగుతుంది
- క్యారెట్‌తో పాటు బీన్స్, క్యాబేజ్ వంటి పదార్థాలతో కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. రోజూ క్యారెట్ తినకుండా అప్పుడప్పుడు వీటిని వినియోగించి కూడా ఈ రిసిపిని తాయారు చేసి పిల్లలకు పెట్టొచ్చు.
- ఈ రెసిపీ తయారుచేసేటప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకొని కలిపితే ఇంకా బాగుటుంది. రుచి మొత్తం మారిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications