Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కాలిఫ్లవర్ వేపుడు ఇలా చేస్తే..అద్దిరిపోయే టేస్ట్!
కాలీఫ్లవర్..దీనిని మనం సాధారణంగా గోబీ అని పిలుస్తాం. ఒకప్పుడు కేవలం శీతాకాలంలో మాత్రమే లభించే ఈ కూరగాయ, ఇప్పుడు అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటోంది. చాలామంది కాలీఫ్లవర్ ను కేవలం రుచి కోసమే తింటారు, కానీ ఇది ఒక సూపర్ ఫుడ్ అని చాలా తక్కువ మందికి తెలుసు. తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉండటం దీని ప్రత్యేకత.
కాలీఫ్లవర్‌ను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల తల నుండి పాదాల వరకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సాధారణంగా మన ఇళ్లల్లో తరచుగా కాలీఫ్లవర్ ఫ్రై చేసుకుంటుంటాం. అయితే ఎప్పుడూ చేసేలా కాకుండా ఈసారి కొత్తగా రెస్టారెంట్ స్టైల్ లో అదిరిపోయే రుచితో కాలీఫ్లవర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-కాలీఫ్లవర్
-కారం
-ఉప్పు
-పసుపు
-ఆవాలు
-జీలకర్ర
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-వెల్లుల్లి
-కరివేపాకు
-నువ్వులు
-ధనియాలు
-పచ్చి శెనగపప్పు
-మినపప్పు
తయారీ విధానం
-ముందుగా ఒక మీడియం సైజు కాలీఫ్లవర్(350-400గ్రాములు) తీసుకొని దీనిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒకటిన్నర లీటరు వరకు నీళ్లు పోసి అందులో కొంచెం ఉప్పు వేసి మరిగించండి. నీళ్లు మరిగిన తర్వాత అందులో అర టీస్పూన్ పసుపు వేసి కలిపాక అందులో కాలీఫ్లవర్ ముక్కలు వేసి 10 నిమిషాలు అలా వదిలేయండి.
-కాలీఫ్లవర్ ను ఉడకనివ్వకూడదు. జస్ట్ 10 నిమిషాలు వేడి నీళ్లలో ఉంచి తీసేయాలి. దీనివల్ల కాలీఫ్లవర్ క్లీన్ అవుతుంది. 10 నిమిషాలు వేడి నీటిలో ఉంచాక తీసి ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో వేడి నీళ్లలో వేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలి.ఎక్కువగా కలపకుండా మధ్య మధ్యలో కలుపుకుంటే చాలు.
-కాలీఫ్లవర్ ముక్కలు వేగుతున్న సమయంలో..ఒక మిక్సీ గిన్నెలో ఒకటిన్నర టీస్పూన్ ఎర్ర కారం, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, 7 వెల్లుల్లి రెమ్మలు వేసి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు వేగిన కాలీఫ్లవర్ ముక్కలను ఆయిల్ లో నుంచి తీసి ఓ ప్లేట్ లో పెట్టుకోండి.
-ఇప్పుడు పాన్ లో ఉన్న ఆయిల్ లోనే పోపు దినుసులు(ఆవాలు,జీలకర్ర, పచ్చి శెనగపప్పు, మినపప్పు) వేసి వేయించుకోండి. పోపు దినుసులు వేగాక ఇందులోనే 1 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి.
-ఉల్లిపాయలు వేగాక అందులో 1రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించాక అందులోనే వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఇందులోనే పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో 2 నిమిషాలు తక్కువ మంట మీద వేయించాలి. తర్వాత అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసి కలిపి 1 నిమిషం తక్కువ మంట మీద వేయించి స్టవ్ ఆపేయండి.
-అంతే సూపర్ టేస్టీ కాలీఫ్లవర్ వేపుడు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







