చాతుర్మాస్య స్పెషల్: ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచినిచ్చే ఆల్ రౌండర్ మసాలా ఇంట్లోనే చేసుకోండిలా..

Posted By:

వర్షాకాలం, చాతుర్మాస్య దీక్షల సమయంలో చాలా ఇళ్లలో ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకాన్ని పూర్తిగా మానేస్తారు. ఇవి లేకుండా చేసే వంటలు చాలా చప్పగా, రుచి లేకుండా ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. కేవలం పండుగల సమయంలోనే కాకుండా, నిత్యం సాత్విక లేదా జైన ఆహారం తీసుకునేవారు కూడా ఉల్లి, వెల్లుల్లికి దూరంగా ఉంటారు. మరి వీరు తినే ఆహారం రుచికరంగా ఉండాలంటే ఎలా?

మీ చప్పటి భోజనానికి అద్భుతమైన రుచిని జోడించే ఒక మ్యాజిక్ మసాలా రెసిపీని సోషల్ మీడియాలో ఒక ప్రముఖ ఫుడ్ క్రియేటర్ షేర్ చేశారు. ఈ ఆల్ రౌండర్ మసాలాను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని కూరల్లోనే కాకుండా అన్నం, పరాటా, స్నాక్స్.. ఇలా దేనిలోనైనా వాడుకోవచ్చు.

Chaturmasya Special No Onion Garlic All Rounder Masala Recipe in Telugu

ఆల్ రౌండర్ మసాలా తయారీకి కావలసిన పదార్థాలు

కరివేపాకు - పెద్ద గుప్పెడు
పల్లీలు (వేరుశెనగలు) - కొద్దిగా
కాశ్మీరీ ఎండు మిరపకాయలు - తగినన్ని
ఎండు కొబ్బరి పొడి లేదా తురుము - కొద్దిగా
ధనియాలు, జీలకర్ర - సమాన పరిమాణంలో
ఇంగువ - చిటికెడు
చాట్ మసాలా - కొద్దిగా
నిమ్మరసం - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా

కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి!

ఆల్ రౌండర్ మసాలా తయారీ విధానం

-ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి.

-ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టి, నూనె వేయకుండా కరివేపాకును కరకరలాడే వరకు సన్నని మంటపై డ్రై రోస్ట్ (పొడిగా వేయించి) చేసి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు అదే కడాయిలో వేరుశెనగలు, కశ్మీరీ ఎండుమిర్చి, కొబ్బరి తురుము, ధనియాలు, జీలకర్ర వేసి సన్నని మంటపై 2 నిమిషాల పాటు వేయించాలి. మాడిపోకుండా జాగ్రత్తపడాలి.

-వేయించిన ఈ పదార్థాలన్నింటినీ ఒక ప్లేట్‌ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్‌ లో వేసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ, చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. అన్నింటినీ మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి.

-అంతే.. ఎంతో సువాసన వెదజల్లే ఆల్ రౌండర్ మసాలా రెడీ. ఈ పొడిని గాలి చొరబడని, పూర్తిగా పొడిగా ఉండే ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది.

ఎలా వాడుకోవచ్చు?
ఈ మసాలా ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. మీరు చేసే ఉల్లి, వెల్లుల్లి లేని కూరల్లో లేదా గ్రేవీలలో కొద్దిగా ఈ మసాలా చల్లితే కూర రుచి, వాసన అమాంతం పెరిగిపోతాయి. పరాటా లేదా పూరీ పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా వేసుకోవచ్చు. వేడి అన్నం లేదా కిచిడీలో కొద్దిగా నెయ్యి, ఈ మసాలా కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. శాండ్‌విచ్‌లు, ఖాఖ్రా లాంటి సాయంత్రం స్నాక్స్‌ పై చల్లుకుంటే మంచి కారంగా, రుచిగా అనిపిస్తుంది

[ of 5 - Users]
Story first published: Wednesday, August 19, 2026, 19:25 [IST]
Desktop Bottom Promotion