Latest Updates
-
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా? -
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.? -
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.!
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి!
ఉదయం పూట హడావిడిలో టిఫిన్ చేయడానికి సమయం లేనప్పుడు లేదా ఇంట్లో ఇడ్లీ, దోసె పిండి సిద్ధంగా లేనప్పుడు అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో ఎంతో రుచికరమైన, కరకరలాడే ఇన్ స్టంట్ టమాటో దోసె తయారు చేసుకోవచ్చు. దీనికి పిండిని పులియబెట్టాల్సిన అవసరం అస్సలు లేదు.
టమాటాలోని పులుపు, కారం వల్ల ఈ దోసెలు ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. వీటిని పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కే కాకుండా సాయంత్రం స్నాక్స్ లా కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. బ్యాచిలర్లు సైతం చాలా ఈజీగా తక్కువ సమయంలో స్పాంజి లాంటి మెత్తని టమాటో దోసె ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

టమాటో దోసె తయారీకి కావాల్సిన పదార్థాలు
-టమాటోలు
-ఎండుమిర్చి
-బొంబాయి రవ్వ
-పెరుగు
-పచ్చి కొబ్బరి ముక్కలు
-మైదా పిండి
-ఉప్పు
-జీలకర్ర
-అల్లం
-నూనె
-వంటసోడా
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక!
టమాటో దోసె తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలో 3 పండిన నాటు టమాటోల ముక్కలు, అర కప్పు పుల్లని పెరుగు(లేకుంటే మాములు పెరుగు అయినా), 2 కప్పుల బొంబాయి రవ్వ వేసి అవసరం మేరకు నీళ్లు కలుపుకుంటూ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 4 బ్యాడిగి మిర్చి(లేదంటే కశ్మీరీ కారం), ఒకటిన్నర అంగుళం అల్లం ముక్కలు, అర టీస్పూన్ జీలకర్ర, ఒకటిన్నర టేబుల్ స్పూన్ మైదా పిండి, రుచికి సరిపడా ఉప్పు, 5 గుంటూరు ఎండుమిర్చి, కొంచెం నీళ్లు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లో వేసి మొత్తం రెండు బాగా కలిసేలా కులపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోండి.
-దోశ వేయడానికి ముందు అందులో పావు టీస్పూన్ వంటసోడా వేసుకోండి. అప్పుడే దోసె స్పాంజీలా మెత్తగా వస్తుంది. కావాలనుకుంటే ఈ సమయంలో కొంచెం నీళ్లు కూడా పోసుకుని కలుపుకోండి.
-అరగంట తర్వాత స్టవ్ మీద దోసె పెనం పెట్టి వేడి చెయ్యాలి. పెనం వేడెక్కిన తర్వాత జారుడుగా ఉన్న గరిటెడు పిండిని తీసుకొని పెనం మీద దోసె పోసుకోండి. అంచుల వెంట, మధ్యలో నూనె చిలకరించి మంటను మీడియంలో ఉంచి దోసె ఆవిరిపోకుండా లిడ్(మూత)పెట్టి ఉంచితే దోసె నిదానంగా కాల్చుకోవాలి.
-దోసె పైన బుడగలుగా వచ్చినప్పుడు మూత తీసి దోసెను ప్లేట్ లోకి తీసుకోండి. అంతే టమాటో దోసె రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications