Latest Updates
-
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా.. -
రోజుకు ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
స్పైసీ, క్రంచీ చికెన్ మిక్చర్..ఆహా ఏమి రుచి అనాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మీ ప్రియమైనవారు మిమ్మల్ని అవమానించారా? ఈ ట్రిక్ పాటిస్తే అవమానించినోళ్లే నోరు మూసుకొని పోతారు! -
తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం హరిది..అమృతంలా ఉంటుంది..ఇలా సింపుల్ గా చేసేయండి -
క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఈ స్పెషల్ మసాలాతో చేస్తే ప్లేట్ మొత్తం క్షణాల్లో ఖాళీ! -
సర్వ పాపాలను తొలిగించే తొలి ఏకాదశి.. మీ కుటుంబ సభ్యులకు ఈ మెసేజ్ లతో విషెస్ చెప్పండి -
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.!
చెట్టినాడ్ శనగ కుర్మా..చపాతీతో తింటుంటే కిక్కే కిక్కు!
రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా నైట్ డిన్నర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ, లేదా చపాతీ. అయితే వీటిని తయారుచేయడం కంటే, వాటిలోకి ఏ సైడ్ డిష్ (చట్నీ లేదా కూర) చేయాలన్నదే అసలు సమస్య. రోజూ రొటీన్ గా తినే పల్లి చట్నీ, కొబ్బరి పచ్చడి లేదా కుర్మాలు తిని మీ ఇంట్లో వాళ్లకు బోర్ కొట్టిందా? అయితే మీ రుచి మొగ్గలకు కొత్త ఉత్సాహాన్నిచ్చే చెట్టినాడ్ స్టైల్ శనగ కుర్మా ఓ సారి ట్రై చేయండి.

శనగ కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు
నానబెట్టి ఉడికించుకోవడానికి
శనగలు - పావు కప్పు
నీళ్లు - ఉడికించడానికి సరిపడా (సుమారు ఒకటిన్నర కప్పు)
ఉప్పు - రుచికి తగినంత
మసాలా పేస్ట్ కోసం
పచ్చి కొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు - 6
మిరియాల పొడి - అర టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
పసుపు - 1 టేబుల్ స్పూన్
పెద్ద టమాటా - 1
సాంబార్ ఉల్లిపాయలు- 4
వెల్లుల్లి రెబ్బలు - 3
ఉప్పు - కొద్దిగా
కూర తయారీకి
వంకాయలు - 4
చిన్న ఉల్లిపాయలు - 10
చింతపండు గుజ్జు - అర కప్పు
నువ్వుల నూనె - 1 చెంచా
సోంపు - అర చెంచా
ఆవాలు - పావు చెంచా
కరివేపాకు - 1 రెమ్మ
స్పైసీ, క్రంచీ చికెన్ మిక్చర్..ఆహా ఏమి రుచి అనాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
శనగ కుర్మా తయారీ విధానం
-ముందుగా శనగలను శుభ్రంగా కడిగి రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ శనగలను కుక్కర్ లో వేసి, నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి సుమారు 6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఎండు మిరపకాయలు, మిరియాల పొడి వేసి సువాసన వచ్చేవరకు దోరగా వేయించాలి.
-ఆ తర్వాత సాంబార్ ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమాటా ముక్కలు వేసి టమాటాలు మెత్తబడేవరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆపి.. అందులో పసుపు, పచ్చి కొబ్బరి, ఉప్పు వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి ముందుగా కచ్చాపచ్చాగా రుబ్బి, ఆపై తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నువ్వుల నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, సోంపు వేసి పోపు పెట్టుకోవాలి. ఆ వెంటనే కరివేపాకు వేసి కలపాలి. తరిగిన చిన్న ఉల్లిపాయలు వేసి అవి పారదర్శకంగా మారేవరకు వేయించాలి. ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి.
-ఇప్పుడు అందులో ఉడికించిన శనగలు నీటితో సహా, వంకాయ ముక్కలు, పలచటి చింతపండు గుజ్జు, అవసరమైతే కాస్త ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం మరుగుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టి సరిగ్గా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరి దానంతట అదే పోయే వరకు ఆగి మూత తీయాలి.
-చివరగా, దీనిని మరో 2 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనిచ్చి స్టవ్ ఆపేయాలి.
-అంతే ఘుమఘుమలాడే, వేడి వేడి చెట్టినాడ్ శనగ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications