Latest Updates
-
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
చికెన్ తో రకరకాల వంటకాలు చేయవచ్చు. దేని స్పెషాలిటీ దానిదే. వాడే మసాలాని బట్టి టేస్ట్ మారుతూ ఉంటది. అయితే తమిళనాడు స్పెషల్ చికెన్ నిర్వాణ మీరెప్పుడైనా తిన్నారా? ఇడ్లీ, దోశ, చపాతీ, పరోటాతో తినడానికి ఇది సూపర్ గా ఉంటుంది. అన్నంతో కూడా బాగుంటుంది. దీనిని గ్రీన్ కోకోనట్ చికెన్ కర్రీ అని కూడా అంటారు. బ్యాచిలర్స్ కూడా దీనిని చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. నిమిషాల్లోనే దీనిని తయారుచేసుకుని ఆస్వాదించవచ్చు. సూపర్ టేస్టీ చికెన్ నిర్వాణ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
చికెన్ నిర్వాణ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఫ్రెష్ మసాలా కోసం:
-కొత్తిమీర ఆకులు
-కరివేపాకు
-అల్లం
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-జీలకర్ర
-మిరియాలు
-ధనియాలు
-లవంగాలు
చికెన్ కోసం:
-ఉప్పు
-కారం
-కొబ్బరి పాలు
-కొబ్బరి నూనె
-కరివేపాకు

చికెన్ నిర్వాణ తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. అందులో కొంచెం కొత్తిమీర, 1 రెమ్మ కరివేపాకు, 1 పచ్చిమిరపకాయ, కొద్దిగా జీలకర్ర, 4 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ధనియాలు, కొంచెం అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి కొంచెం నీళ్లు కలుపుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత చికెన్ ముక్కలను శుభ్రంగా కడగండి. శుభ్రం చేసిన చికెన్ ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకోండి, అందులో ఉప్పు, కారం, గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. దీనిపై మూతపెట్టి 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి లేదా బయట అలాగే వదిలేయండి
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొబ్బరి నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కాక అందులో చికెన్ ముక్కలను వేసి అందులో కొంచెం నీళ్లు పోసి మూతపెట్టి 10-15 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత మూత తీసి అందులో కొబ్బరి పాలు పోసి మరో 5 నిమిషాలు ఉడికించాలి.
-చివరగా అందులో కొంచెం కరివేపాకు చల్లుకోండి.
-అంతే చికెన్ నిర్వాణ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
