Latest Updates
-
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
ఈ ఏడాది విజయదశమి లేదా దసరా పండుగను అక్టోబర్ 20(మంగళవారం)జరుపుకుంటారు. అయితే దసరా రోజున చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణలో దసరా రోజు, ఆ మరుసటి రోజు కూడా బంధువులందరూ కలిసి నాన్ వెజ్ వండుకుని విందు చేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తుంది.
ఈ దసరాకి ఇంటికి చికెన్ తెచ్చుకుంటే ఓ సీక్రెట్ మసాలతో కర్రీ చేసుకుంటే టేస్ట్ యమా రుచిగా ఉంటుంది. సీక్రెట్ మసాలాతో దసరా స్పెషల్ గా చికెన్ కర్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-1 కేజీ చికెన్
-2 స్పూన్ల కారం
-చిటికెడు పసుపు
-రుచికి తగినంత ఉప్పు
-పెరుగు
-గరం మసాలా దినుసులు
-జీలకర్ర
-ధనియాలు
-ఎండుమిర్చి
-నెయ్యి
-ఉల్లిపాయ
-వెల్లుల్లి రెబ్బలు
-టమాటో ముక్కలు
-పుదీనా
-కొత్తిమీర
-కరివేపాకు
-కసూరి మేథీ
-నూనె
-కొబ్బరి పొడి
-ధనియాల పొడి
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా..
తయారీ విధానం
-ముందుగా 1 కేజీ చికెన్ ముక్కలను శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్ లో వేయండి. చికెన్ ముక్కల మీద 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, సగం కప్పు పెరుగు వేసి మొత్తం ముక్కలకు పట్టేలా చేతులతో బాగా కలుపుకున్నాక దీనిని 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి.
-ఈ లోగా సీక్రెట్ మసాలా రెడీ చేసుకోండి. ఇందుకోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో జీలకర్ర, గరం మసాలా, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. దోరగా వేయించాక వీటిని తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్ లో కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ చీలికలు, కొన్ని టమాటో ముక్కలు వేసి మెత్తబడే దాకా ఉడికించాలి. చివరగా ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
-మిశ్రమం చల్లారిన తర్వాత వేయించినవన్నీ మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తర్వాత అందులో 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకునన్న చికెన్ ను వేయాలి. ఇందులోనే కొంచెం నిమ్మరసం పిండి, కరివేపాకు, పుదీనా కూడా వేసి బాగా కలిపి మూతపెట్టి 10 నిమిషాలు చికెన్ ను ఉడకనివ్వాలి. దీంతో చికెన్ లోని నీరంతా బయటకు వచ్చి చికెన్ సగం ఉడికినట్లే.
-తర్వాత మూత తీసి అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేయండి. ఇందులోనే కొంచెం కసూరి మేథీ నలిపి వేసి మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. మూతపెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి.
-మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయినప్పుడు మూత తీసి అందులో కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి కలుపుకుంటే సీక్రెట్ రెడ్ చికెన్ రెడీ.
-వేడి వేడి బగారా అన్నంలో ఒక్కో ముక్కతో తింటుంటే ఆహా అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
