Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సన్ డే స్పెషల్ క్రిస్పీగా..టేస్టీగా చికెన్ పకోడా రిసిపి
మన ఇండియన్ స్నాక్స్ లో పకోరా ఒకటి. ఇది ఆల్-టైమ్ క్లాసిక్ ఫేవరెట్. అత్యంత ప్రాచుర్యం పొందిన ఉల్లిపాయ పకోడా, బ్రెడ్ పకోరా, పనీర్ పకోరా, చికెన్ పకోడా నుండి అంతగా తెలియని ఫిష్ పకోరా వరకు వివిధ రకాలు ఉన్నాయి.చికెన్ పకోరా అనేది ఒక ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ మరియు ఒక ఆకలి పుట్టించేది, ఇక్కడ లేత చికెన్ ముక్కలలతో బంగారు రంగులో క్రిస్పీగా నోరూరించే విధంగా తయారు చేసుకుంటారు.
వీటిని తయారు చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. కరకరలాడే చికెన్ పకోరా చేయడానికి ఆంధ్రా స్టైల్ రెసిపీని ఇక్కడ షేర్ చేస్తున్నాను. నార్త్ ఇండియన్ స్టైల్ పకోరాలను సాధారణంగా చికెన్‌ను డీప్ ఫ్రై చేయడానికి ముందు చిక్కటి పిండిలో ముంచి తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఆంధ్రా స్టైల్లో తయారుచేసిన చికెన్ చాలా టేస్ట్ గా ఉంటుంది. దీన్ని క్రిస్పిగా తయారుచేయడానికి కొన్ని పిండి పదార్థాలు, గుడ్డు సొనను ఉపయోగిస్తాము. ఇది చక్కని స్టార్టర్ ఐటెమ్‌కూడా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..

కావల్సిన పదార్థాలు:
6 టేబుల్ స్పూన్లు బేసన్ (శెనగ పిండి) (¼ కప్పు + 2 టేబుల్ స్పూన్లు)
3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి లేదా మొక్కజొన్న పిండి
⅓ టీస్పూన్ ఉప్పు (రుచికి సర్దుబాటు చేయండి)
¼ టీస్పూన్ పసుపు
¾ నుండి 1 టీస్పూన్ కాశ్మీరీ ఎర్ర మిరప పొడి
¾ నుండి 1 టీస్పూన్ గరం మసాలా
¾ నుండి 1 టీస్పూన్ చికెన్ మసాలా
¾ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
¾ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా దంచిన అల్లం వెల్లుల్లి
1 నుండి 2 పచ్చి మిరపకాయలు తరిగినవి
2 రెమ్మలు కరివేపాకు లేదా 2 టేబుల్ స్పూన్లు పుదీనా ఆకులు లేదా కొత్తిమీర తరిగిన
1 మీడియం ఉల్లిపాయ (అవసరం అనుకుంటే) చూర్ణం/తరిగిన/ముక్కలుగా చేసి
2 గుడ్డు తెల్ల సొన పోయాలి.
తయారు చేయు విధానం:
1. ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో శెనగపిండి, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, కారం, ధనియాల పొడి, గరం మసాలాల పొడి, పసుపు, వేయాలి
2. తర్వాత అందులోనే 2 గుడ్లు నుండి తీసిన తెల్ల సొన వేయాలి.
3. ఇప్పుడు తురిమిన వెల్లుల్లి, అల్లం, కరివేపాకులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అన్నీ కలిపి వేసుకోవాలి .
4. ఇప్పుడు వాటిలో తగినంత నీరు పోసి బాగా కలపాలి. అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసిన చికెన్ వేసి బాగా కలపాలి.
5. తర్వాత అందులో 2 టీ స్పూన్ల వెనిగర్ వేయాలి.ఇలా తయారైన మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో 30 నిమిషాల వరకూ నానపెట్టాలి.
6. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె వేసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు నూనె వేడి కాగానే ముందుగా కలిపిన చికెన్ మిశ్రమాన్ని పకోడీల్లా వేయాలి.
7. చికెన్ ముక్కలు బాగా వేగి ఇవి బంగారు రంగులోకి మారేవరకూ ఫ్రై చేయాలి. ఇలా తయారైన పకోడీలు సాయంత్రం వేళల్లో చాలా బాగుంటుంది. వీటిని సాస్‌తో తినొచ్చు లేదా అలానే తినొచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications