Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
క్రిస్మస్ స్పెషల్..గుడ్లు లేకుండానే ఇంట్లో బేకరీ స్టైల్ కుకీలు..రుచి అదుర్స్
క్రిస్మస్ అంటేనే సంతోషం, డెకరేషన్, గిఫ్ట్ ల పండుగ. కానీ ఇవన్నీ ఒకెత్తయితే.. నోరూరించే తీపి వంటకాలను ఆస్వాదించడం మరొక ఎత్తు. నిజానికి,క్రిస్మస్ పండుగ పూర్తి అనుభూతిని పొందాలంటే ఇంట్లో తయారుచేసిన కేకులు, కుకీల సువాసనలు ఇల్లంతా నిండాల్సిందే. ఆ ఘుమఘుమలు పండుగ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి.
సాధారణంగా బేకరీలలో దొరికే కుకీలలో గుడ్లు ఉపయోగిస్తుంటారు. దీనివల్ల చాలా మంది శాఖాహారులు వాటిని తినడానికి సంకోచిస్తుంటారు. గుడ్లు ఉపయోగించకుండానే అచ్చం బేకరీలో దొరికే వాటికంటే అద్భుతమైన రుచితో, క్రిస్పీగా ఉండే కుకీలను మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో అందుబాటులో ఉండే సాధారణ పదార్థాలతోనే వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
ఎగ్ లెస్ కుకీస్ తయారీకి కావలసిన పదార్థాలు
మైదా పిండి: 1 కప్పు
చక్కెర పొడి: అర కప్పు
వెన్న: అర కప్పు
వెనిల్లా ఎసెన్స్: 1 టీస్పూన్
బేకింగ్ పౌడర్: అర టీస్పూన్
పాలు: 1-2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: చిటికెడు
అలంకరణకు: సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో మెత్తబడిన వెన్న, చక్కెర పొడిని తీసుకోండి. ఈ రెండింటినీ బాగా కలపాలి. మిశ్రమం లేత తెలుపు రంగులోకి మారి, క్రీమ్ లా తయారయ్యే వరకు బీట్ చేయాలి. ఆ తర్వాత వెనిల్లా ఎసెన్స్ వేసి మరోసారి కలపాలి.
-ఇప్పుడు ఆ గిన్నెలోని మిశ్రమంలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు వేసి జల్లెడ పట్టండి. ఇలా జల్లెడ పట్టడం వల్ల పిండిలో గడ్డలు లేకుండా ఉండటమే కాకుండా, కుకీలు చాలా మృదువుగా వస్తాయి.
-ఇప్పుడు చేతితో అన్ని పదార్థాలను నెమ్మదిగా కలపాలి. పిండిని చపాతీ పిండిలా గట్టిగా ఒత్తకూడదు. కేవలం పదార్థాలన్నీ కలిసేలా తేలికపాటి చేతులతో కలపాలి. ఒకవేళ మిశ్రమం మరీ పొడిగా అనిపిస్తే రెండు చెంచాల పాలు జతచేయవచ్చు. పిండిని ఎక్కువగా కలిపితే కుకీలు గట్టిగా మారే అవకాశం ఉంది.
-ఇప్పుడు ఓవెన్ ను 180°C వద్ద ప్రీ హీట్ చేయండి. బేకింగ్ ట్రేలో బేకింగ్ పేపర్ వేసి సిద్ధం చేసుకోండి. కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బంతులుగా చేసి అరచేతిలో ఉంచుకుని తేలికగా నొక్కి చదునైన బిస్కెట్ షేప్ ఇవ్వండి. వాటిపై చాకో చిప్స్ లేదా డ్రై ఫ్రూట్స్ ముక్కలను అద్ది అలంకరించండి.
-సిద్ధం చేసిన ట్రేని ఓవెన్లో ఉంచి సుమారు 12 నుండి 15 నిమిషాల పాటు బేక్ చేయండి. కుకీల అంచులు లేత బంగారు రంగులోకి మారిన వెంటనే బయటకు తీయాలి.
-ఓవెన్ నుండి తీసినప్పుడు కుకీలు చాలా మెత్తగా అనిపిస్తాయి, కానీ కంగారు పడవద్దు. వాటిని కనీసం 10-15 నిమిషాల పాటు ట్రేలోనే పూర్తిగా చల్లారనివ్వాలి. గాలి తగిలే కొద్దీ అవి గట్టిపడి, సరైన క్రిస్పీనెస్ పొందుతాయి. వేడిగా ఉన్నప్పుడు తీస్తే అవి విరిగిపోయే అవకాశం ఉంది. అంతే ఎగ్ లెస్ కుకీస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












