Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
క్రిస్మస్ స్పెషల్..ఇంట్లోనే స్వచ్ఛమైన రెడ్ వైన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. చర్చి గంటలు, రంగురంగుల అలంకరణలు, క్రిస్మస్ తాత గిఫ్ట్ లతొ పాటు ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ విందు భోజనం. ముఖ్యంగా క్రిస్మస్ కేక్, వైన్ లేనిదే ఈ పండుగ సంబరాలు పూర్తికావు అని చెప్పవచ్చు. చాలా కుటుంబాల్లో అతిథులకు వైన్ వడ్డించడం ఒక సంప్రదాయం.
అయితే మార్కెట్లో లభించే వైన్ లలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండటంతో పాటు రసాయనాలు ఉంటాయనే భయంతో చాలామంది వాటికి దూరంగా ఉంటారు. మరి అలాంటి వారి కోసం ఎలాంటి కల్తీ లేకుండా, మన ఇంట్లోనే చాలా సులభంగా, రుచికరమైన రెడ్ వైన్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావలసిన పదార్థాలు
నల్ల ద్రాక్ష: 1 కిలో
చక్కెర: 500 గ్రాములు
ఈస్ట్: 5 నుండి 10 గ్రాములు
నీరు: సుమారు 2 లీటర్లు
మసాలా దినుసులు: దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు
తయారీ విధానం
-ముందుగా నల్ల ద్రాక్ష పండ్లను కాండం నుండి వేరు చేయాలి. వాటిపై ఉండే దుమ్ము, ధూళి పోయేలా నీటిలో శుభ్రంగా కడగాలి.
-శుభ్రంగా కడిగిన ద్రాక్షను చేతితో లేదా స్పూన్ తో తేలికగా నొక్కి రసం తీయాలి. తొక్కలు, గింజలను తీసివేయకూడదు. ఎందుకంటే వైన్ కు వచ్చే ఆకర్షణీయమైన ఎరుపు రంగు, ఘాటైన రుచి ఈ తొక్కల నుండే వస్తుంది.
-ఇప్పుడు ఒక శుభ్రమైన, పొడి పింగాణి లేదా గాజు జాడీలో ముందుగా సిద్ధం చేసుకున్న ద్రాక్ష గుజ్జును వేయాలి. దీనికి చక్కెర, ఈస్ట్, మసాలా దినుసులను (వీటిని ఒక చిన్న వస్త్రంలో మూటకట్టి వేయవచ్చు) జతచేయాలి. ఇప్పుడు ద్రాక్ష మునిగేలా కాచి చల్లార్చిన నీటిని పోయాలి. చెక్క గరిటెతో ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి.
-జాడి మూతిని గట్టిగా మూయకుండా, ఒక పలుచని మస్లిన్ వస్త్రంతో కట్టాలి. ఈ జాడిని చీకటిగా, చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలి.
-మొదటి వారం రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చెక్క గరిటెతో మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ద్రాక్ష తొక్కలు రసంతో బాగా కలిసి రంగును ఇస్తాయి. ఈ ప్రక్రియ సుమారు 10 నుండి 21 రోజుల పాటు జరుగుతుంది. జాడిలో బుడగలు రావడం ఆగిపోయి, ద్రాక్ష తొక్కలు అడుగుకు చేరితే కిణ్వ ప్రక్రియ పూర్తయినట్లే.
-కిణ్వ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒక శుభ్రమైన వస్త్రం లేదా జల్లెడ సహాయంతో వైన్ ను వడకట్టాలి. పిప్పిని, మసాలా దినుసులను వేరు చేయాలి. ఇలా వడకట్టిన స్వచ్ఛమైన వైన్ ను శుభ్రమైన గాజు సీసాల్లో పోసుకోవాలి. సీసా నిండా కాకుండా కొంచెం ఖాళీ ఉంచి మూత బిగించాలి.
-వైన్ ను కనీసం 1 నుండి 3 నెలల పాటు కదల్చకుండా నిల్వ ఉంచితే దాని రుచి అద్భుతంగా మారుతుంది. వైన్ ఎంత పాతదైతే అంత రుచి ఉంటుంది. చివరగా, ఈ వైన్ ను ముదురు రంగు సీసాలలో పోసి భద్రపరచుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












