Latest Updates
-
ఆడవారిలో రక్తం బాగా పెరగాలంటే..తరచూ వీటిని తినండి -
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా..
నోట్లో పెట్టుకుంటే జారిపోయే పచ్చికొబ్బరి హల్వా..చక్కెర లేకుండానే 10 నిమిషాల్లోనే చేసుకోండిలా..
స్వీట్లలో రారాజు హల్వా. హల్వాలో బోలెడు రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉన్నా హల్వా టేస్ట్ హల్వాకే సొంతం. దీని రుచి, వాసన అన్నీ అద్భుతమే. అయితే మీ ఇంట్లో పచ్చికొబ్బరి ఉంటే ఈ సారి ఈజీగా హల్వా చేసుకుని చూడండి. చాలా చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే తయారుచేసుకోవచ్చు. పైగా దీని తయారీకి చక్కెర కూడా వాడనక్కర్లేదు. దీంతో ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరితో హల్వా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్ధాలు
-నెయ్యి
-లేత కొబ్బరి
-జీడిపప్పు
-పెసరపప్పు
-బియ్యం
-బెల్లం
-నీళ్లు
-యాలకల పొడి

తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ ఒక పాన్ పెట్టుకోండి. ఆ పాన్ లో నూనె లేకుండానే 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసి మాడిపోకుండా సన్నని సెగ మీద దోరగా వేయించాలి. దోరగా వేగి లైట్ గా రంగు మారుతున్నప్పుడు స్టవ్ ఆపేయాలి. వీటన్నింటిని పూర్తిగా చల్లారనివ్వాలి.
-పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో ఉన్న ఈ పొడిలోనే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేయండి. కొబ్బరికి వెనుక సైడ్ తోలుని కచ్చితంగ తీసేయాలి. ఈ మిక్సీ జార్ లోనే మీ తిపిని బట్టి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోండి. పావు కప్పు వరకు నీళ్లు కూడా పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అంటే వెన్న మాదిరిగా రావాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక అందులో 2 టేబుల్ ప్పూన్ జీడిపప్పు చిన్న ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చికొబ్బరి లేదా ఎండుకొబ్బరి ముక్కలు వేసి వేయించి రంగు మారాకా వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది
-ఇప్పుడు అదే పాన్ లో ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసి గరిటతో కలుపుతూ అడుగు అంటుకోకుండా మధ్యమధ్యలో నెయ్యి కలుపుకుంతూ ఉడికించాలి.
-హల్వా దగ్గరకు అయ్యి, నెయ్యి వదులుతూ ఉన్నప్పుడు అందులో వేయించుకున్న జీడిప్పు, కొబ్బరి ముక్కలు, అరటీస్పూన్ యాలకల పొడి కూడా వేసి కలిపి స్టవ్ ఆపేయండి.
-అంతే సూపర్ టేస్టీ కొబ్బరి హల్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
