Latest Updates
-
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది!
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది
వీకెండ్ వస్తే నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగనివాళ్లకు ఒక గుడ్ న్యూస్. ఈ వీకెండ్ లో మీ ఇంటికి చేపలు కనుక తెచ్చుకుంటే వాటిని ఎప్పుడూ చేసేలా కాకుండా ఒకసారి తమిళనాడు స్టైల్ లో వండండి. ఈ స్టైల్ చేపల కర్రీ వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా పలుసు చుక్క కూడా మిగల్చకుండా మొత్తం ముక్కలు పులుసు ఒక్కరే తినేసినా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. తమిళనాడు స్టైల్ కమ్మని చేపల పులుసు మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-చేప ముక్కలు
-కరివేపాకు
-కొత్తిమీర
-ఉప్పు
-పసుపు
-జీలకర్ర
-సోంపు
-మిరియాలు
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-టమాటో
-ఉల్లిపాయ
-మెంతులు
-నూనె
-కారం
-ధనియాల పొడి

తయారీ విధానం
-ముందుగా 750 గ్రాములు చేప ముక్కలు తీసుకోండి. వీటిని శుభ్రంగా కడి ఒక ప్లేట్ లో వేయండి. ఈ చేప ముక్కల మీద ఉప్పు, పసుపు వేసి బాగా కలిపాక అర గంట సేపు అలా వదిలేయంది. దీంతో అవి మంచిగా ఊరతాయి.
-అరగంట తర్వాత స్టవ్ మీద పెద్ద బాండీ పెట్టుకోండి. అందులో రెండు చిటికెళ్ల మెంతులు, పావు టీస్పూన్ సోంపు, 1 టీస్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. మాడకుండా వేయించాక వీటిని తీసి మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే పాన్ లో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చెయ్యండి. వేడెక్కిన నూనెలో 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి చిట్లనివ్వాలి, తర్వాత ఇందులోనే 1 ఉల్లిపాయ క్యూబ్స్, 4 పచ్చిమిరపకాయలు, 15 వెల్లుల్లి రెబ్బలు వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేదాకా వేయించుకుంటే చాలు.
-ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత అందులో 3 పండు టమాటోల మీడియం సైజ్ లో కట్ చేసిన ముక్కలు వేసి వాటిపైన తొక్క సపరేట్ అయ్యి మెత్తబడేదాకా మగ్గించాలి. తర్వాత దింపి ఈ మొత్తాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా, వెడల్పుగా ఉండే పెద్ద బాండీ పెట్టి అందులో 1/3 కప్పు నూనె వేసి వేడయ్యాక అందులో చిటికెడు మెంతులు వేసి ఎర్రబడనివ్వండి. వేగుతున్న మెంతులలో 1 టీస్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయల తుంపిన ముక్కలు వేసి వేపండి. మిర్చి రంగు మారాక 2 రెబ్బల కరివేపాకు వేసి వేయించాలి.
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు
-వేగిన తాలింపులో గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ ను వేసి అందులో నుంచి నూనె పైకి తేలే వరకు వేపండి. ఇది వేగుతున్నప్పుడే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, అర టీస్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలిపి వేపండి. కారాలు వేసి అంచుల వెంట నూనె సపరేట్ అవుతున్నప్పుడు అందులో 50 గ్రాముల చింతపండు నుంచి తీసిన చిక్కటి పులుసు పోసి నిదానంగా కలుపుతూ వేపాలి.
-గ్రేవీలో నుంచి నూనె పైకి తేలిన తర్వాత అందులో పక్కన ఉంచుకున్న చేప ముక్కలను వేసి ఒకదానిపక్కన ఒకటిలా సర్దుకోండి. తర్వాత ఇందులో 2 కప్పుల పల్చగా ఉండే కొబ్బరి పాలు(రెండోసారి తీసిన కొబ్బరి పాలు) పోసుకోండి. ఒకవేళ మీ దగ్గర చిక్కని కొబ్బరి పాల ప్యాకెట్ ఉంటే మాత్రం అందులో పావు కప్పు ఆ పాలు పోసి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోండి. కలిపి మూతపెట్టి నిదానంగా నూనె పైకి తేలేవరకు ఉడకనివ్వాలి.
-పులుసు మరిగి మరిగి అంచుల వెంట నూనె వదులుతున్నప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న సోంపు జీలకర్ర పొడి వేసి నెమ్మదిగా బాండీని రెండువైపులా పట్టుకుని పైకి కిందకు కదిపితే ఆ మసాలా అంతా చేపల ముక్కలలోకి దిగుతుంది. అప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లి నూనె పైకి తేలేంతవరకు మీడియం మంట మీదనే ఉడికించండి. చివరగా అందులో కరివేపాకు తుంచి వేసి స్టవ్ ఆపేయండి. 3-4 గంటలు అలాగే వదిలేయండి. అప్పుడే పులుసు ముక్కకు పట్టుకుంటది. తర్వాత వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
