Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
చికెన్ పులావ్, మటన్ పులావ్ ఎప్పుడూ తినేదే. కానీ ఎప్పుడైనా కొబ్బరి పాలతో మటన్ పులావ్ ట్రై చేశారా. ఒక్కసారి దీని రుచి చూశారంటే బిర్యానీ జోలికి కూడా వెళ్లరు. మసాలా ఘుమఘుమలు చుట్టుపక్కల ఇళ్లకి వ్యాపించేలా ఉండే ఈ కొబ్బరి పాల మటన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం..

కొబ్బరి పాల మటన్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
మటన్- కేజీ
పసుపు- పావు టీస్పూన్
కారం- రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు- రెండు టీస్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు టీ స్పూన్లు
గరం మసాలా- టీస్పూన్
పెరుగు- కప్పు
పులావ్ కోసం కావాల్సిన పదార్థాలు
ఉల్లిపాయలు- రెండు
టమాటా- రెండు
పచ్చిమిర్చి- ఐదు
బియ్యం- 750 గ్రా
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
మసాలా దినుసులు
పుదీనా- గుప్పెడు
కొత్తిమీర- గుప్పెడు
జీడిపప్పు పలుకులు- పది
కొబ్బరి పాలు- రెండున్నర గ్లాసులు
కొబ్బరి పాల మటన్ పులావ్ తయారీ విధానం
కొబ్బరి పాల మటన్ పులావ్ తయారీ కోసం ముందుగా మటన్‌ను గంటపాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇందుకోసం తాజా మటన్‌ను శుభ్రంగా కడిగి అందులో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టి గంట సేపు పక్కన పెట్టుకోవాలి.
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
బాస్మతి బియ్యాన్ని రెండు సార్లు కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో టేబుల్ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి రంగు మారేవరకు వేయించాలి.
పొడుగ్గా కట్‌చేసుకున్న టమాటా వేసి బాగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ వేసి ఉడకనివ్వాలి. మటన్ ఉడికిన తర్వాత పావు లీటర్(250 మి.లీ) నీళ్లు పోసి ఉడికించుకోవాలి.

మటన్ 80 శాతం వరకు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోని గ్రేవీని, మటన్ ముక్కలను సెపరేట్ చేసుకోవాలి.
పులావ్ కోసం స్టవ్‌పైన వెడల్పాటి బాణలి పెట్టుకుని మిగిలిన నెయ్యి, నూనె వేసి కాగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి.
బాస్మతి బియ్యం తీసుకుంటున్నప్పుడు గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్లు కొలత తీసుకోవాలి. సాధారణ బియ్యం అయితే రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవచ్చు.
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
ఈ కొలత మాదిరిగా 750 గ్రాముల బాస్మతి బియ్యం అంటే నాలుగున్నర గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవచ్చు. ఈ మేరకు రెండున్నర గ్లాసుల కొబ్బరి పాలు, మటన్ గ్రేవీ రెండు గ్లాసుల వరకు అవుతుంది.
ఈ మొత్తాన్ని బాణలిలో పోసుకుని మరగనివ్వాలి. ఎసరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి కలపాలి. తర్వాత ఉడికించిన మటన్ ముక్కలను వేసి కలిపి మీడియం మంటపైన పులావ్ ఉడికించాలి.
ఎసరు దగ్గరకు అయ్యాక చిన్న మంటపైన ఉంచి ఉడికించాలి. పులావ్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఘాటైన, టేస్టీ కొబ్బరి పాల మటన్ పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications