Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
పెళ్లిళ్లలో వడ్డించే స్పెషల్ కళ్యాణ రసం..ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు..ఇంట్లోనే ఇలా చేసుకోండి
పెళ్లి భోజనాల్లో వడ్డించే ప్రత్యేకమైన రసం రుచి మీకు గుర్తుందా? ఆ వాసనకే సగం కడుపు నిండిపోతుంది. ఆ చిక్కటి, కమ్మటి రుచి నాలుకపై నాట్యమాడుతూ ఉంటుంది. ప్రతిరోజూ చేసుకునే రసానికి, ఆ పెళ్లింటి రసానికి ఎంతో తేడా ఉంటుంది. దాని రహస్యం ఏమిటబ్బా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ రహస్యం మరేంటో కాదు,అప్పటికప్పుడు తాజాగా నూరిన ఓ ప్రత్యేకమైన మసాలా పొడి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ రసంతో కలిపి తింటుంటే, ఆ అనుభూతే వేరు. ఈ కళ్యాణ రసం చేయడం చాలా సులభం. ఒక్కసారి దీని రుచి చూశారంటే, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. పెళ్లి భోజనాల్లో వడ్డించే రసాన్ని అదే టేస్ట్ తో మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
రసం పొడి కోసం:
-మినప్పప్పు - 2 టేబుల్ స్పూన్లు
-ధనియాలు - అర టేబుల్ స్పూన్
-మిరియాలు - అర టేబుల్ స్పూన్
-ఎండుమిర్చి - 4
-జీలకర్ర - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
-కరివేపాకు - ఓ రెమ్మ
రసం తయారీకి:
-నూనె - అర టేబుల్ స్పూన్
-ఎండుమిర్చి - 4
-ఆవాలు - 1 టీస్పూన్
-దంచిన వెల్లుల్లి రెబ్బలు - 10
-జీలకర్ర - 1 టీస్పూన్
-కరివేపాకు - ఓ రెమ్మ
-టమోటాలు - 3
-పసుపు - 1 టీస్పూన్
-ఇంగువ - పావు టీస్పూన్
-చింతపండు రసం - పావు కప్పు
-ఉడికించి మెదిపిన కందిపప్పు - 1 కప్పు
-నీళ్లు - రెండున్నర కప్పులు
-ఉప్పు - రుచికి సరిపడా
-బెల్లం తురుము - 1 టేబుల్ స్పూన్
-సన్నగా తరిగిన కొత్తిమీర - గుప్పెడు

తయారీ విధానం
-ముందుగా రసం పొడి సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ పై బాండీ పెట్టి అందులో మినప్పప్పు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి వేసి మంచి సువాసన వచ్చే వరకు చిన్నమంట మీద దోరగా వేయించుకోవాలి.
-అవి వేగాక చివరగా జీలకర్ర, కరివేపాకు వేసి ఒక్క నిమిషం వేయించి స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత వేయించినవన్నీ మిక్సీ జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి.
-ఇప్పుడు అదే బాండీలో నూనె వేడిచేసి, ఆవాలు, ఎండుమిర్చి వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.
-ఇప్పుడు తరిగిన టమోటా ముక్కలు, పసుపు వేసి, అవి మెత్తగా మగ్గిపోయే వరకు మూతపెట్టి ఉడికించాలి.
-టమోటాలు మెత్తబడ్డాక చింతపండు రసం, ఒక కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి.
-ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పు, మనం సిద్ధం చేసుకున్న రసం పొడి, మరో కప్పున్నర నీళ్లు పోసి అన్నీ కలిసేలా తిప్పాలి. రసం ఒక పొంగు రాగానే, స్టవ్ ఆపివేయాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, బెల్లం తురుము వేసి కలిపి వెంటనే మూతపెట్టాలి. ఆ రుచులన్నీ రసంలోకి ఇంకడానికి ఓ ఐదు నిమిషాలు వదిలేయండి. అంతే నోరూరించే, కమ్మనైన కళ్యాణ రసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications