Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రోజూ తినే చట్నీ బోర్ కొట్టిందా? ఈ టమాటా గుడ్డు చట్నీ ట్రై చేయండి..5 నిమిషాల్లో బ్రహ్మాండమైన రుచి
సాధారణంగా మన తెలుగు వాళ్ల ఇళ్లల్లో పొద్దున్నే ఎక్కువగా తయారుచేసే బ్రేక్ ఫాస్ట్ లలో ఇడ్లీ,దోశ, ఉప్మా ఉంటాయి. వీటిల్లోకి సైడ్ డిష్ గా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్ తయారుచేస్తుంటారు. రోజూ ఇవే తిని తిని చాలామందికి బోర్ కొట్టేస్తుంది. అసలు మ్యాజిక్ అంతా మనం తినే సైడ్ డిష్ లోనే ఉంటుంది. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్ అన్నీ రొటీన్ అయిపోతే..టమాట గుడ్డు చట్నీ ట్రై చేయండి? వినడానికి వింతగా ఉన్నా, రుచి మాత్రం అమోఘం. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. కేవలం గుడ్డు, టమాటా ఉంటే చాలు నిమిషాల్లో గుమగుమలాడే చట్నీ రెడీ చేసేయొచ్చు. ఈ సూపర్ ఫాస్ట్ చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
పెద్ద టమాటాలు: 4-5
పెద్ద ఉల్లిపాయ: 1
కరివేపాకు: 2 రెమ్మలు
వెల్లుల్లి రెబ్బలు: 2
ఆవాలు: అర టీస్పూన్
పసుపు: పావు టీస్పూన్
కారం: అర టీస్పూన్
పచ్చిమిర్చి: 2
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
చక్కెర: చిటికెడు
గుడ్లు: 2
కొత్తిమీర: కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ వేయండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా, బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒక్క నిమిషం పాటు వేగించండి.
-ఇప్పుడు బాండీలో తరిగిన టమాటా ముక్కలు వేసి అవి మెత్తగా మగ్గి, నూనె పైకి తేలేంత వరకు 3-4 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించండి.
-టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, చిటికెడు చక్కెర వేసి బాగా కలపండి. మసాలాల పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం వేయించండి.
-తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి చట్నీ దగ్గరపడే వరకు మీడియం మంట మీద ఉడకనివ్వండి. టమాటాలు పూర్తిగా ఉడికి, గ్రేవీలా తయారయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి.
-వెంటనే బాండీలో ఉన్న వేడి గ్రేవీలోనే రెండు గుడ్లను పగలగొట్టి వేయండి. గరిటతో గుడ్లు గ్రేవీలో పూర్తిగా కలిసిపోయి క్రీమీగా అయ్యేదాకా వేగంగా కలపాలి. (ఆ వేడికే గుడ్లు ఉడికిపోతాయి).
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన, నోరూరించే గుడ్డు టమాటా చట్నీ రెడీ. వేడివేడి ఇడ్లీ, దోశ, చపాతీ లేదా అన్నంలోకి కూడా ఈ చట్నీ అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications